Share News

హరియాణాలో ఆప్‌నకు ఊపు!

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:44 AM

అధినేత కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల హరియాణా ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తుందని ఆప్‌ శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీ పొరుగునే ఉండే ఈ రాష్ట్రంలో అక్టోబరు 5న పోలింగ్‌ జరగనుంది.

హరియాణాలో ఆప్‌నకు ఊపు!

  • అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: అధినేత కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల హరియాణా ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తుందని ఆప్‌ శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీ పొరుగునే ఉండే ఈ రాష్ట్రంలో అక్టోబరు 5న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రె్‌సతో పొత్తు చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆప్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు మొత్తం 90 సీట్లకు గాను కాంగ్రెస్‌ 89 చోట్ల బరిలో దిగింది. ఒక స్థానాన్ని సీపీఎంకు ఇచ్చింది. వాస్తవానికి ఆనుకుని ఉండే ఢిల్లీ, పంజాబ్‌లో ఽఅదికారంలో ఉన్నప్పటికీ హరియాణాలో ఆప్‌ ఇంతవరకు ఒక్క సీటూ గెలవలేదు. ఈ సారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రె్‌సతో కలిసి వెళ్లాలని తొలుత భావించినా అది కుదరలేదు.

దీంతో 40 సీట్లలో అభ్యర్థులను దింపింది. కాగా, 2019 ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేసిన ఆప్‌.. ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేకపోయింది. నోటా కంటే కొన్ని ఎక్కువ ఓట్లు మాత్రమే పొందింది. ఈసారి ఎన్నికలు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారడం, నిన్నటివరకు కేజ్రీవాల్‌ జైల్లో ఉండడంతో హరియాణాలో ఆప్‌ ప్రచారాన్ని భుజాన మోసేదెరనే ప్రశ్న వేధించింది. ఇప్పుడు కేజ్రీ బయటకు రావడంతో ఎన్నికల్లో పోరాటానికి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. కేజ్రీ ప్రసంగాలు, సూటి ప్రశ్నలు ఓట్లు రాలుస్తాయని భావిస్తున్నాయి.

కొందరు కార్యకర్తలైతే ఆయన ఎన్నికల ముఖచిత్రాన్ని మారుస్తారని అంటున్నారు. హరియాణా ఎన్నికల బాధ్యత మొత్తాన్ని కేజ్రీనే మోస్తారని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు. కేజ్రీ విడుదల హరియాణాలో పార్టీకి పునరుత్తేజం చేస్తుందని మరో నాయకుడు పేర్కొన్నారు. వివిధ కీలక అంశాలపై ఇప్పటివరకు పార్టీ విధానాలను స్పష్టంగా చెప్పలేకపోయామని, ఇకపై ఆ బెంగ లేదన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 03:53 AM