AAP: బీజేపీపై ఆప్ మంత్రి సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:15 PM
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేత, మంత్రి ఒకరు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.
ఢిల్లీ : ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేత, మంత్రి ఒకరు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంత్రి అతిశీ మర్లేనా మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఒక పథకం ప్రకారం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పార్టీ విచ్ఛిన్నమవుతుందని.. అలా ఎమ్మెల్యేలను బయటకి లాగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు.. ఇప్పటికే 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని ఆరోపించారు.
మొత్తంగా 21 మంది ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ చెబుతోందని.. చర్చలు జరిపిన 7 మందికి టికెట్‌తో సహా రూ.25 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి ఆపరేషన్ కమల్ చేపడుతోందని.. ఇది సరికాదని పేర్కొన్నారు. దీనిపై తమ పార్టీ అప్రమత్తంగా ఉందని.. నేతలందరూ కమలదళ రాజకీయాలను తిప్పికొట్టాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి