Share News

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

ABN , Publish Date - Dec 27 , 2024 | 02:46 PM

జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీకి 2002లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో జైలుశిక్ష పడిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రచారంలో లేరు.

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ (Hafiz Abdul Rahman Makki) శుక్రవారంనాడు లాహోర్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. గత కొన్ని రోజులుగా మక్కీ తీవ్ర అస్వస్థతతో ఉన్నారని, లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాబెటిస్‌కు చికిత్స పొందుతున్నారని జేయూడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో కన్నుమూసినట్టు పేర్కొంది.


జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీకి 2020లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో జైలుశిక్ష పడిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రచారంలో లేరు. పాకిస్థాన్‌ భావజాలానికి మక్కీ ప్రతిబింబాస్తాడని ఒక ప్రకటనలో పాకిస్థాన్ ముతహిద ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది.


ఐక్యరాజ్యసమతి 2023లో మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఆయన ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు ఆయన ప్రయాణాలపై నిషేధం విధించింది. కాగా, భారత్‌లోని రామ్‌పుర, ఎర్రకోట, ముంబై ఉగ్రదాడుల్లో కూడా మక్కీ కీలక పాత్ర వహించాడు.


ఇవి కూడా చదవండి...

Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో

Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 02:48 PM