UAE : గర్భస్రావాలకు యూఏఈలో చట్టబద్ధ అనుమతి
ABN , Publish Date - Jun 22 , 2024 | 03:07 AM
గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
దుబాయ్, జూన్ 21: గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అత్యాచారానికి గురయినవారు, వావివరసలు లేకుండా అక్రమంబంధాలు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చిన మహిళలకు ఊరట కలిగించింది. అలాంటి వారు గర్భస్రావం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మహిళల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అత్యాచారానికి, అక్రమ సంబంధానికి బలయిన వెంటనే వారు తొలుత సంబంధిత అధికార్లకు తెలియజేయాల్సి ఉంది. దీన్ని రుజువు చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం నుంచి నివేదిక తీసుకురావాలి. పిండం వయసు 120 రోజులకు మించనప్పుడు మాత్రమే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏడాది పాటు యూఏఈలో నివసించే వారికే ఇది వర్తిస్తుంది.