Share News

Haryana Elections: ఫలితాలు వస్తుండగానే చేతులెత్తేసిన రాబర్ట్ వాద్రా

ABN , Publish Date - Oct 08 , 2024 | 06:12 PM

హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా సంచలన పోస్ట్ చేశారు. ''ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానిని అంగీకరించండి'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Haryana Elections: ఫలితాలు వస్తుండగానే చేతులెత్తేసిన రాబర్ట్ వాద్రా

న్యూఢిల్లీ: హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా (Robert Vadra) సంచలన పోస్ట్ చేశారు. ''ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానిని అంగీకరించండి'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కౌంటింగ్ తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. ఆ తర్వాత రౌండ్లలో బీజేపీ పుంజుకుని గెలుపు దిశగా వెళ్లింది. ఈ క్రమంలోనే రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''ప్రజలు కోరుకున్న దానిని అంగీకరించండి. వారెన్నుకున్న నాయకులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిద్దాం. దేశం గురించి ఆలోచించండి" అని వాద్రా పోస్ట్ చేశారు.

Haryana Elections: రాహుల్ గాంధీ 'జిలేబి' పాచిక అట్టర్ ఫ్లాప్


హ్యాట్రిక్ విజయం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటింది. 48 స్థానాల్లో బీజేపీ గెలుపును ఖాయం చేసుకోని మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకుంది. బీజేపీ విజయాన్ని ఈసారి బ్రేక్ చేస్తుందనుకున్న కాంగ్రెస్ 37 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని మెజారిటీకి మార్క్‌కు దూరంగా ఉండిపోయింది. ఐఎన్ఎల్‌డీ 2, ఇతరులు 3 స్థానాల్లో తమ గెలుపును ఖాయం చేసుకున్నారు.


For More National News and Telugu News..

ఇది కూడా చదవండి..

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

Updated Date - Oct 08 , 2024 | 06:13 PM