Mumbai: ముంబైలో ఘార ప్రమాదం.. గాయపడిన నటి, మెట్రో కార్మికుడు మృతి
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:52 PM
శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో నటి తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది

ముంబై: మరాఠీ నటి ఊర్మిళా కొఠారే (Urmila Kothare) ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పిన ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, ఊర్మిళ, ఆమె కారు డ్రైవరు స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో ఊర్మిళ తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది. వీరిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
Arvind Kejriwal: మా పథకాలకు భయపడే బీజేపీ అడ్డుకుంటోంది: కేజ్రీవాల్
కారు ప్రమాదంలో ఊర్మిళ, అతని డ్రైవర్ గాయపడినప్పటికీ సకాలంలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు శాంతానగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఊర్మిళకారు బాగా దెబ్బతింది. ఈ ఘటనపై ఊర్మిళ భర్త, డైరెక్టర్ ఆదినాథ్ కొఠారే కూడా ఇంకా స్పందించలేదు. మెట్రో కార్మికుడి మృతి, మరొకరు గాయపడటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఊర్మిళ కొఠారే 'దునియాదారి', 'శుభమంగళ్ సావ్‌ధాన్' తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల మరాఠీలో స్టార్ ప్రవహ్ షో "తుజెచ్ మి గీత్ గాత్ ఆహే' ద్వారా ఆమె బుల్లితెరపై కనిపించారు.
ఇవి కూడా చదవండి..
National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే
Read More National News and Latest Telugu News