Share News

Rahul Sambhal Visit: సంభాల్ పర్యటనను అడ్డుకోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే

ABN , Publish Date - Dec 04 , 2024 | 05:10 PM

తన కాన్వాయ్‌ను వదిలిపిట్టి ఒంటరిగా పోలీసులతో కలిసి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డానని, అయితే తన మాటను లెక్కచేయకుండా కొద్దిరోజుల తర్వాత రావాలని అధికారులు చెప్పినట్టు రాహుల్ తెలిపారు.

Rahul Sambhal Visit: సంభాల్ పర్యటనను అడ్డుకోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే

సంభాల్: సంభాల్ (Sambhal) హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తన కాన్వాయ్‌ను ఘజియాపూర్ సరిహద్దుల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిలదీశారు. బాధిత ప్రజలను కలుసుకోకుండా అడ్డుకోవడం రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును తోసిపుచ్చడమేనని అన్నారు. తన కాన్వాయ్‌ను వదిలిపిట్టి ఒంటరిగా పోలీసులతో కలిసి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డానని, అయితే తన మాటను లెక్కచేయకుండా కొద్దిరోజుల తర్వాత రావాలని అధికారులు చెప్పినట్టు తెలిపారు.

Maharashtra: ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం.. గవర్నర్‌ను కలిసిన 'మహాయుతి' నేతలు


''మేము సంభాల్ వెళ్లేందుకు ప్రయత్నించాం. పోలీసులు నిరాకరిస్తూ మమ్మల్ని ముందుకు వెళ్లనీయలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా (LoP) బాధితులను కలుసుకునేందుకు వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ వాళ్లు నన్ను ఆపేశారు. నేను ఒంటరిగా పోలీసులతో వెళ్లేందుకు సిద్ధపడ్డా. అందుకు కూడా అధికారులు ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత వస్తే అప్పుడు అనుమతిస్తామని చెప్పారు. ఇది ఎల్‌ఓపీ, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకం. మేము కేవలం సంభాల్ వెళ్లి అక్కడ ఏమి జరిగిందో చూడాలనుకుంటున్నాం. ప్రజలను కలుస్తాం. నాకున్న రాజ్యాంగ హక్కును కూడా తోసిపుచ్చుతున్నారు. ఇదీ మన నవీన భారతం, రాజ్యాంగానికి చరమగీతం పాడే ఇండియా, అబేంద్కర్ రాజ్యాంగానికి చెల్లుచీటీ చెప్పే ఇండియా. మా పోరాటం కొనసాగుతుంది'' అని ఘజియాబాద్ సరిహద్దుల్లో రాహుల్ మాట్లాడుతూ అన్నారు.


రాహుల్‌కు ఆ హక్కుంది: ప్రియాంక

కాగా, హింసాకాండ బాధితులను పరామర్శించే హక్కు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌కు ఉందని ఆయన సోదరి, వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ అన్నారు. "సంభాల్‌లో రాహుల్‌ను అడ్డుకోవడం సరికాదు. బాధితులను కలుసుకునే రాజ్యాంగ హక్కు ఆయనకు ఉంది. యూపీ పోలీసులతో ఒంటరిగా వెళ్తానని కూడా ఆయన చెప్పారు. అందుకు కూడా వాళ్లు ఒప్పుకోలేదు. పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఈమాత్రం విషయాన్ని కూడా చక్కదిద్దలేని పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లో ఉండొచ్చు. శాంతి భద్రతల విషయంలో పట్టువిడువలు లేని ధోరణలో వారెందుకు మాట్లాడుతున్నారు?'' అని ప్రియాంక ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే

Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ

Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Dec 04 , 2024 | 05:15 PM