Jammu and Kashmir: జైలు నుంచి విడుదలైన ఎంపీ ఇంజనీర్ రషీద్
ABN , Publish Date - Sep 11 , 2024 | 08:06 PM
ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నయా కాశ్మీర్ కోసం తాను పోరాటం చేస్తానని జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తీహాడ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నయా కాశ్మీర్ కోసం తాను పోరాటం చేస్తానని జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తీహాడ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం విలేకర్లతో ఇంజనీర్ రషీద్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం పారాటం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజలను ఏకం చేసేందుకే తాను జైలు నుంచి తిరిగి వచ్చానని తెలిపారు. అంతేకానీ ప్రజలను విడగొట్టేందుకు కాదని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాశ్వత శాంతి తీసుకు రావాల్సి అవసరం ఉందన్నారు. కాశ్మీరీలు.. రాళ్లు రువ్వే వారు కాదనిన్నారు. రాజకీయ హక్కులు సాధించే క్రమంలో ఏ మాత్రం రాజీపడబోమని ఎంపీ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు.
Also Read: Telugu States: వరద నష్టంపై నివేదిక అందజేత
2017లో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై ఇంజినీర్ రషీద్‌ను జాతీయ భద్రత సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను న్యూఢల్లీలోని తీహాడ్ జైలుకు తరలించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి అవామీ ఇతహిద్ పార్టీ అభ్యర్థిగా ఇంజినీర్ రషీద్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై ఇంజనీర్ రషీద్ ఘన విజయం సాధించారు.
Also Read: Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
లోక్‌సభలో సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు రషీద్‌కు నాలుగు రోజులు పేరోల్‌పై కోర్టు విడుదల చేసింది. ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఇంజనీర్ రషీద్ ఆశ్రయించారు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఇంజనీర్ రషీద్ జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read: Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్
ఇంజనీర్ రషీద్ బెయిల్‌పై విడుదల కావడంపై పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు తమదైన శైలిలో స్పందించారు. ఇంజనీర్ రషీద్‌కు బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇంజనీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇతహిద్ పార్టీ.. బీజేపీకి తోక పార్టీ అని పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ వ్యంగ్యంగా అన్నారు. రషీద్ జైల్లో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలువడంతోనే ఆ విషయం అర్థమైందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.
Also Read: Sonia Gandhi: సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన
Read More National News and Latest Telugu New