Ajit Pawar Vs Shinde: షిండేపై జోక్ కట్ చేసిన అజిత్.. కౌంటర్ జోక్ పేల్చిన షిండే
ABN , Publish Date - Dec 04 , 2024 | 08:07 PM
కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖలు ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే, అజితి పవార్ ఆ వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు 'పంచ్'లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
ముంబై: మహారాష్ట్రలో 'మహాయుతి' కూటమి కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అనే ఉత్కంఠ ఇంతవరకూ కీలక నేతల మధ్య వేడి రగిలిస్తే, ఇప్పడు కూటమి భాగస్వామ్య నేతలు అహ్లాదకరమైన వాతావరణంలో 'జోక్'లు విసురుసుకుంటున్నారు. ఆ జోక్‌లు విన్న వాళ్లు సైతం వాళ్లు నవ్వులతో శ్రుతికలుపుతున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖలు ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే, అజితి పవార్ ఆ వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు 'పంచ్'లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
Maharashtra: 'మహా' సర్కార్ కొలువుతీరేందుకు ముహూర్తం ఫిక్స్
అజిత్ పంచ్.. షిండే కౌంటర్
ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారా అని ఏక్‌నాథ్ షిండేను మీడియా ప్రశ్నించడంతో ''సాయంత్రం వరకూ అగండి'' అని ఆయన సమాధామిచ్చారు. ఆయన పక్కనే ఉన్న అజిత్ పవార్ వెంటనే షిండేను ఉద్దేశించి.. "ఆయన సాయంత్రానికి నిర్ణయం తీసుకుంటారు, నేను మాత్రం గురువారం తప్పనిసరిగా ప్రమాణస్వీకారం చేస్తాను. నేను వేచిచూసేది లేదు'' అన్నారు. దీంతో అంతే వేగంగా అజిత్‌కు షిండే కౌంటర్ ఇచ్చారు. ''అజిత్ దాదా అనుభవజ్ఞుడు. ఆయన ఉదయం, సాయంత్ర కూడా ప్రమాణస్వీకారం చేయగలరు'' అంటూ నవ్వేశారు. దీంతో అజిత్‌తో సహా అక్కడున్న అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
గవర్నర్ సై..
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సారథ్యంలోని 'మహాయుతి' కూటమిని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) అధికారికంగా బుధవారం సాయంత్రం ఆహ్వాన పత్రం పంపారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవిస్ తమ కూటమి భాగస్వామ్య పార్టీ నేతలైన ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌తో కలిసి గవర్నర్‌ను కోరిన కొద్దిసేపటికే ఆయన గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చారు. డిసెంబర్ 5వ తేదీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుందని గవర్నర్‌తో సమావేశానంతరం ఫడ్నవిస్ మీడియా సంయుక్త సమావేశంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే
Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ
Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.