Share News

Akhilesh on Waqf Law: వక్స్ చట్టానికి కేంద్రం సవరణలపై మా వైఖరిదే..

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:51 PM

వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్ర సమయాత్తమవుతుండటంపై ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్లెం వేస్తూ "వక్స్ లా-1995'ను సవరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ముస్లింల హక్కులను హరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Akhilesh on Waqf Law: వక్స్ చట్టానికి కేంద్రం సవరణలపై మా వైఖరిదే..

న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్ర సమయాత్తమవుతుండటంపై ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్లెం వేస్తూ "వక్స్ లా-1995'ను సవరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ముస్లింల హక్కులను హరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కనిపించిన ప్రతిభూమిని తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరమిత అధికారానికి కట్టడి చేసేందుకు కేంద్రం సవరణలు తెస్తోంది. సదరు భూములు, ఆస్తుల కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. భూముల విలువను కలెక్టర్లు మదింపు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డులో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పించాల్సి ఉంటుంది. సుమారు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ మంత్రివర్గం ఇటీవల ఆమోదించగా, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.

Central Government : వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారానికి చెక్‌!


విభజించడమే వారి పని...

కాగా, వక్స్ బోర్డు చట్టానికి కేంద్రం సవరణలు తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సూటిగా సమాధానమిచ్చారు. ప్రతిపాదిత బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. హిందూ, ముస్లింలను విడగొట్టటం, ముస్లిం సోదరుల హక్కులు లాక్కోవడం, రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను ఏవిధంగా హరించాలన్నదే బీజేపీ పని అని విమర్శించారు. గతంలో మోదీ ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్ల హక్కులను ఊడబెరికిందని అన్నారు. అంతకుముందు ఆంగ్లో ఇండియన్లకు లోక్‌సభలో ఒక సీటు, విధాన సభలో ఒక సీటు ఉండేదని, కానీ వారు తప్పుడు జనగణన చేసి ఆంగ్లో ఇండియన్ల సీటును ఊడలాక్కున్నారని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 03:54 PM