Share News

Akhilesh Yadav: ఎంపీ సీటును ఉంచుకుని ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:37 PM

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన యూపీలోని కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కర్హల్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయనున్నారు.

Akhilesh Yadav: ఎంపీ సీటును ఉంచుకుని ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఘన విజయం సాధించిన యూపీలోని కన్నౌజ్ (Kannauj) లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కర్హల్ (Karhal) అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ మంగళవారంనాడు ప్రకటించారు.

Amitshah takes charge: మోదీ 3.0లో అమిత్‌షా తొలి ప్రాధాన్యత ఏమిటంటే..


కార్యకర్తలకు చెప్పా...

కాగా, కర్హాల్, మెయిన్‌పురి కార్యకర్తలను తాను కలుసుకున్నానని, రెండు చోట్లా ఎన్నికల్లో గెలిచినందున ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని తెలియజేశానని అఖిలేష్ తెలిపారు. త్వరలోనే విధాన సభను వదులుకోనున్నట్టు చెప్పారు.


మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ, అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో పార్టీ నేతగా వ్యవహరించనున్నారని, ఇందుకు సంబంధించిన లాంఛనాలను ఢిల్లీలో పూర్తి చేయనున్నారని చెప్పారు. ఇందుకు గాను పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక జరగాల్సి ఉందని, అఖిలేష్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.. 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా మాజ్‌వాదీ పార్టీ ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాలను కైవసం చేసుకుంది.

Updated Date - Jun 11 , 2024 | 04:37 PM