Alert: ప్రయాణికులకు అలర్ట్.. జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..
ABN , Publish Date - Jul 28 , 2024 | 08:19 AM
సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.
సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల(trains) వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి. దౌండ్‌లో ఇంటర్‌లాకింగ్ పనిని నిర్వహించడానికి సెంట్రల్ రైల్వే మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసింది. ఈ క్రమంలో జులై 29న మొత్తం 15 రైళ్లు, జులై 30న 23 రైళ్లు, జులై 31న 24 రైళ్లు రద్దు కానున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జులై 29న ఈ రైళ్లు రద్దైన కొన్ని ట్రైన్లు
1. రైలు నెం 12025 పూణే-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం 12169 పూణే-సోల్పూర్ ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం 01511 పూణే-బారామతి DMU
4. రైలు నెం 01487 పూణే-హరంగుల్ TOD ఎక్స్‌ప్రెస్
5. రైలు నెం 11406 అమరావతి-పూణే ఎక్స్‌ప్రెస్
జులై 30న రద్దైన పలు ట్రైన్లు
1. రైలు నం 17613 పన్వెల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం 11421 హడప్సర్-సోలాపూర్ DMU ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం 11409 దౌండ్-నిజాంబాద్ DMU ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం 01522 డౌండ్-హడప్సర్ DMU
5. రైలు నెం 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
జులై 31న (బుధవారం) రద్దైన కొన్ని ట్రైన్ల వివరాలు
1. రైలు నెం 11041 దాదర్-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం 01529 పూణే-డౌండ్ DMU
3. రైలు నెం 17630 నాందేడ్-పూణే ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం 01525 పూణే-డౌండ్ MEMU ప్యాసింజర్
5. రైలు నెం 12026 సికింద్రాబాద్-పూణె ఎక్స్‌ప్రెస్
ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రైన్లలో ప్రయాణించాలనుకుంటే ఆయా ట్రైన్ల జర్నీ గురించి సమాచారం తెలుసుకుని ప్రయాణించండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..
Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..
first T20 India vs Sri Lanka : ‘టాప్’షోతో బోణీ
Read More National News and Latest Telugu News