Share News

All party meet: డిప్యూటీ స్పీకర్ పదవి కోరిన కాంగ్రెస్, నీట్ అంశం ప్రస్తావన

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:08 PM

పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరింది...

All party meet: డిప్యూటీ స్పీకర్ పదవి కోరిన కాంగ్రెస్, నీట్ అంశం ప్రస్తావన

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం (All party meeting) ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 'నీట్' (NEET) అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రస్తావించింది. విపక్షాలకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని కూడా ఆ పార్టీ కోరింది.


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రా మార్గంలో దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి చేసిన అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ లేవనెత్తారు. రాజ్యసభ ఎంపీ తివారీ మాట్లాడుతూ, సాంప్రదాయబద్ధంగా అఖిలపక్ష సమావేశం జరుగుతుంటుందని, తద్వారా సభ ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన అంశాలను లెవనెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, పేపర్ లీక్‌లు, చైనాతో భద్రతాంశాలు, పార్లమెంటులో విగ్రహాల తొలగింపు, రైతులు, కార్మికులు, మణిపూర్, రైలు ప్రమాదాలు, 'నీట్' వంటి అశాంలను చర్చించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.


టీఎంసీ గైర్హాజర్

పశ్చిమబెంగాల్‌లో అమరవీరుల దినోత్సవం జరుపుకొంటున్నందున తృణమూల్ కాంగ్రెస్ నేతలు అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. 1993లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రెంట్ అధికారంలో ఉన్నప్పడు రాష్ట్ర సచివాలయానికి మార్చ్ నిర్వహించిన కార్యకర్తలపై పోలీసులు కాల్పులకు దిగడంతో 13 మంది కాంగ్రెస్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్ధం జూలై 21న అమరవీరులు దినోత్సవం జరుపుతుంటారు. అప్పట్లో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు.

INC: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ


హాజరైన నేతలు వీరే..

బడ్జె్ట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తిరుచ్చి శివ, ఏఐయూఎంఎల్ నేత ఈడీ మహమ్మద్ బషీర్, బీజేడీ నేత సస్మిత్ పాత్ర, జేడీయూ నేత సంజయ్ ఝా, కేంద్రమంత్రులు రామ్‌దాస్ అథవాలే, ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాశ్వాన్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం హాజరయ్యారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 03:28 PM