Video: బెంగళూరులో నీటి కొరత వేళ.. సూపర్ ఐడియాను నెట్టింట పంచుకున్న ఆనంద్ మహీంద్ర
ABN , Publish Date - Mar 17 , 2024 | 05:45 PM
కర్ణాటక రాజధాని బెంగళూరులో భూగర్భ జలాలు అడుగంటుటుండంతో ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఓ వినూత్న ఐడియాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భూగర్భ జలాలు అడుగంటుటుండంతో ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఓ వినూత్న ఐడియాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా మంది తమ ఇళ్లు, ఆఫీసులలో ఏసీలు వాడుతుంటారు. అయితే, ఎయిర్ కండీషనర్ల నుంచి బయటకు వచ్చే నీరు మొత్తం వృథాగానే పోతుంటుంది. ఆ నీటిని ఆదా చేసే వినూత్న పద్ధతిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో ఏసీలోంచి బయటకి వచ్చే నీరంతా ఓ పైప్‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దాని చివరి భాగంలో ఓ చిన్న ట్యాప్ బిగించారు. తీవ్ర నీటి ఎద్దడి వేళ బెంగళూరు ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ వీడియోను పంచుకున్నారు.
‘నీటి కొరత ఉన్నప్పుడు ఏసీ నీటిని సులభంగా సేకరించవచ్చు. ఈ పద్ధతిలో 100 లీటర్ల ఏసీ నీటిని పైపులో నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని మనం అనేక విధాలుగా వాడుకోవచ్చు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, మొక్కలకు పోయడానికి, వాహనాలు కడగటానికి తదితర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నీరు ఆదా అవుతాయి. నీటిని ఆదా చేస్తూ.. పొదుపుగా వాడుకోవాలి’ అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ పేర్కొన్నారు. సదరు వీడియో ఆనంద్ మహీంద్రను ఆకట్టుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన నెటిజన్లతో పంచుకున్నారు నీరు సంపద అని.. సురక్షితంగా నిల్వ చేసుకోవాలని సూచించారు. బెంగళూరులో నీటి సమస్య తీరాలంటే ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.