New Criminal Laws: ఇకపై బాధితులకు సంపూర్ణ న్యాయం.. కొత్త న్యాయ చట్టాలపై అమిత్ షా
ABN , Publish Date - Jul 01 , 2024 | 02:53 PM
దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) అమల్లోకి రావడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) హర్షం వ్యక్తం చేశారు. ఇకపై బాధితులకు సత్వర, వేగవంతమైన న్యాయం జరుగుతుందని అన్నారు.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) అమల్లోకి రావడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) హర్షం వ్యక్తం చేశారు. ఇకపై బాధితులకు సత్వర, వేగవంతమైన న్యాయం జరుగుతుందని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తరువాత స్వదేశీ న్యాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు. వలస రాజ్యాల చట్టాల స్థానంలో భారత పార్లమెంటు రూపొందించిన ఈ చట్టాలు ఎన్నో రకాలుగా ఆలోచించి తెచ్చినవి. ఈ చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న పోలీసుల హక్కులతో పాటు బాధితుల, ఫిర్యాదుదారుల హక్కులు కూడా రక్షించబడతాయి" అని షా వెల్లడించారు.
కొత్త చట్టాల గురించి..
బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా (బీఎన్‌ఎస్), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్ఎస్)గా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఎస్)గా మారనున్నాయి. అయితే, వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది.
గత ఏడాది డిసెంబరులో సదరు చట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, చర్చ జరపకుండానే బిల్లులను ఆమోదించారని పిటిషనర్లు అంజలీ పటేల్, ఛాయామిశ్రా పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలను సేకరించలేదన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు
For Latest News and National News click here