LokSabha Elections: ఫలితాలు రాగానే ‘వారిద్దరు’ ఇదే చెబుతారు
ABN , Publish Date - May 29 , 2024 | 07:41 PM
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 70 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014 నాటి ఎన్నికల రికార్డును తమ పార్టీ బద్దలు కొడతుందని తెలిపారు. ఈ సారి ప్రధాని మోదీని అనుకూల పవనాలు చాలా బలంగా వీస్తున్నాయన్నారు.
లఖ్‌నవూ, మే 28: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 70 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014 నాటి ఎన్నికల రికార్డును తమ పార్టీ బద్దలు కొడతుందని తెలిపారు. ఈ సారి ప్రధాని మోదీని అనుకూల పవనాలు చాలా బలంగా వీస్తున్నాయన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో మీడియాకు ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. యూపీలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో యూపీలో అఖిల్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఉన్న పరిస్థితులను ఈ సందర్భంగా అమిత్ షా సోదాహరణగా వివరించారు.
Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
1960 అనంతరం.. మళ్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటు పరిస్థితులు బాగున్నాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇక బుందేల్ ఖండ్ ప్రాంత వాసుల కోసం మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తీసుకు వచ్చిందని వివరించారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలు లబ్ది పొందారని గుర్తు చేశారు. ఆ క్రమంలో వారంతా మోదీకి బాసటగా నిలుస్తారని చెప్పారు.
Also Read: కరణ్ కాన్వాయి ఢీకొని ఇద్దరు మృతి
గత ఎన్నికల వేళ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్‌డీ, కాంగ్రెస్ పార్టీలకు 43 శాతమే ఓట్ షేర్ ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయని తెలిపారు. నేడు కాంగ్రెస్, ఎస్పీ ఓట్ షేర్ 26 శాతమే ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 దశల పోలింగ్‌తో బీజేపీకి 310 స్థానాలు వస్తాయని అమిత్ షా జోస్యం చెప్పారు.
Also Read: వైద్యారోగ్య శాఖ మంత్రి ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు..!
ఇక ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ 40 స్థానాలు కూడా గెలుచుకోలేదని.. అలాగే అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజవాదీ పార్టీ 4 స్థానాలు గెలుచుకుంటుందని అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రెస్‌మీట్ పెట్టి.. తమ ఓటమికి ఈవీఎంలే కారణమంటూ పేర్కొంటారని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న సంగతి తెలిసిందే.
Also Read: మంచినీటిని వృధా చేస్తే.. రూ. 2 వేలు ఫైన్
For More National News and Telugu News..