Anand Mahindra: 2024 ఎన్నికలకు సంబంధించి ఇదే బెస్ట్ ఫొటో.. దీని వెనుక కథేంటంటే..
ABN , Publish Date - May 21 , 2024 | 02:47 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగు సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన వీడియోలను, ఫొటోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగు సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన వీడియోలను, ఫొటోలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో చాలా మందిని ఆకట్టుకుంటోంది. 2024 ఎన్నికల్లో (2024 Elections) ఇదే బెస్ట్ ఫొటో (Best Picture) అంటూ ఆనంద్ మహీంద్రా ఆ ఫొటోను పంచుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గ్రేట్ నికోబార్ (Great Nicobar) ద్వీపంలోని అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు (Shompen tribe) చెందిన ఏడుగురిలో ఒక వ్యక్తి మొదటిసారి ఓటేశారు. ``2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో. గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి`` అంటూ ఆనంద్ కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 2.4 లక్షల మందికి పైగా ఈ ఫొటోను లైక్ చేశారు. ``పిక్చర్ ఆఫ్ ది డే`` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ``ఇది చాలా గొప్ప విషయం``, ``గతంలో కంటే చాలా మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు``, ``గ్రేట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: సెక్స్ వర్కర్ దారుణం.. హెచ్‌ఐవీ సోకిన విషయం దాచి 200 మందితో శృంగారం.. చివరకు..
Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..