Share News

Annamalai: ‘కమల’ వికాసానికి కృషిచేద్దాం...

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:30 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని మనసులో పెట్టుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా, రాష్ట్రంలో కమలం వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) పిలుపునిచ్చారు.

Annamalai: ‘కమల’ వికాసానికి కృషిచేద్దాం...

- బీజేపీ శ్రేణులకు అన్నామలై పిలుపు

- ముఖ్య నేతలతో భేటీ

చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని మనసులో పెట్టుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా, రాష్ట్రంలో కమలం వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) పిలుపునిచ్చారు. స్థానిక టి.నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో గురువారం ఉదయం పార్టీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశం అన్నామలై అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి లభించిన ఓట్లు, పోటీ చేసిన ప్రాంతాల్లో పార్టీకున్న గుర్తింపు, పార్టీ నిర్వాహకుల పనితీరు తదితర అంశాలపై విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా అన్నామలై పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖామంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తదితరుల సూచనల మేరకు పార్టీ నిర్వాహకులందరూ ఏకాభిప్రాయంతో పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రాగి + ఇనుము = బంగారం...


లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయామని, పోలైన 14 శాతం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, దీన్ని మరింత పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. జూలై 13వ తేదీని జరిగే విక్రవాండి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో పార్టీకి మండల స్థాయిలో నిర్వాహకులు లేరని, దీనిపై కూడా దృష్టిసారించాలన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్వాహకులను నియమించడంతో పాటు అన్ని జిల్లాల్లో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసి, ఆ వివరాలతో కూడిన నివేదికను పార్టీ జిల్లా నేతలు సమర్పించాలని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో అధిక స్థాయిలో తప్పుడు కేసులు నమోదు చేస్తున్న డీఎంకే ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఈ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో న్యాయవాదుల విభాగాన్ని బలోపేతం చేయాలని, ఈ కేసులలో ఇబ్బందులపాలవుతున్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో-ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌, సీనియర్‌ నేతలు కేశవ వినాయగం, హెచ్‌.రాజా, పొన్‌ రాధాకృష్ణన్‌, వానతి శ్రీనివాసన్‌, కరాటే త్యాగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:30 AM