Share News

K Annamalai: ఉపవాస దీక్ష.. బూట్లు ధరించనంటూ అన్నామలై కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 26 , 2024 | 07:19 PM

K Annamalai: తమిళనాడులో అన్నా యూనివర్సిటీ విద్యార్థిపై లైంగిక దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలై స్పందించారు. రాష్ట్రంలో డీఏంకే ప్రభుత్వం గద్దె దిగే వరకు తాను పాదరక్షలు ధరించనని ఆయన శపథం చేశారు.

K Annamalai: ఉపవాస దీక్ష.. బూట్లు ధరించనంటూ అన్నామలై కీలక నిర్ణయం
TN BJP Chief K Annamalai

చెన్నై, డిసెంబర్ 26: చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యా్ర్థిపై జరిగిన లైంగిక దాడి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. ఈ వ్యవహారంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మహిళల రక్షణకు డీఎంకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ డీఏంకే ప్రభుత్వం గద్దె దిగే వరకు తాను పాదరక్షలు.. బూట్లు ధరించనని ఆయన ప్రకటించారు.

గురువారం కోయంబత్తురులో విలేకర్ల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. ఈ డీఏంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శుక్రవారం నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తాన్నారు. అనంతరం శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలకు వెళ్లి.. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తాన్నారు. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు తనకు తాను ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుంటానని తెలిపారు. అయితే ఎవరూ కొరడాలతో కొట్టుకో వద్దంటూ బీజేపీ కార్యకర్తలకు ఆయన సూచించారు.


డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఇంటి ముందు నిరసన తెలిపాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అలాగే తమ ప్రాంతాల్లోని మహిళలు వారి కుటుంబ సభ్యులు.. బీజేపీ శ్రేణులకు అండగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించాలంటూ మహిళా కమిషన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌కు సైతం లేఖలు రాస్తానని ఈ సందర్భంగా చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించలేని డీఎంకే.. అధికారంలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. అన్నా యూనివర్సిటీలో సీసీ కెమెరాలు లేవని చెప్పడం నిజంగా సిగ్గు చేటు అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే పాలన ముగిసన అనంతరం బూట్లు ధరిస్తానని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు.

Also Read: జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట

Also Read: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం


అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిపై లైంగిక దాడి ఘటన కేసులో ఎఫ్ఐఆర్‌ను లీచ్ చేయడంప తమిళనాడు పోలీసులపై అన్నా మలై విరుచుకు పడ్డారు. బాధితురాలు సిగ్గు పడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో నిందితుడైన వ్యక్తి.. అధికార పార్టీ నేతలతో అంటకాగుతోన్న నేపథ్యంలో అతడు పేరు నేరస్థుల జాబితాలో లేదని తెలిపారు. అంతకుముందు లైంగిక దాడిలో బాధితురాలి వివరాలను ఎఫ్ఐఆర్‌లో వివరించడాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా అన్నామలై తప్పు పట్టారు. ఆ క్రమంలో పోలీసులు, డీఎంకే ప్రభుత్వ తీరు పట్ల మండిపడ్డారు.

Also Read: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు

Also Read: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?

For National News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 07:22 PM