Arvind Kejriwal : ఢిల్లీలో కాంగ్రె్‌సతో పొత్తు లేదు
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:43 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రె్‌సతో ఎలాంటి పొత్తూ ఉండబోదని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ చెప్పారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 1: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రె్‌సతో ఎలాంటి పొత్తూ ఉండబోదని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ చెప్పారు. ఫిబ్రవరిలో జరగనున్న ఈ ఎన్నికల్లో కూటమి కట్టడం లేదన్నారు. ఆదివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండి కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసే పోటీ చేశాయి. కానీ, ఢిల్లీలో ఈ కూటమికి తీవ్ర నిరాశే మిగిలింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాలూ బీజేపీ గెలుచుకుంది. ఇటీవల హరియాణా ఎన్నికల్లో కూడా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. ఢిల్లీ ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.