Share News

Ayodhya Ram Mandir: కుటుంబ సభ్యులతో అయోధ్యకు కేజ్రీవాల్

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:17 PM

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందిందా? వెళ్లే అవకాశం ఉందా? అనే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తనకు ఇంతవరకూ రమ్మని ఆహ్వానం రాలేదని, అయితే జనవరి 22 తర్వాత తన కుంటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని ఆయన చెప్పారు.

Ayodhya Ram Mandir: కుటుంబ సభ్యులతో అయోధ్యకు కేజ్రీవాల్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందిందా? వెళ్లే అవకాశం ఉందా? అనే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తనకు ఇంతవరకూ రమ్మని ఆహ్వానం రాలేదని, అయితే జనవరి 22 తర్వాత తన కుంటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని ఆయన చెప్పారు.


''రామాలయం దర్శించేందుకు మా కుటుంబ సభ్యులంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు. అయితే జనవరి 22న ఒక వ్యక్తినే అనుమతించే అవకాశం ఉన్నందుకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్తాను'' అని మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ చెప్పారు. 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లు నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ట్రస్టు ఆహ్వానంపై మాట్లాడుతూ, తమ టీమ్‌కు ఇన్వెటేషన్ ఇస్తామని చెప్పారని, కానీ తమకు అందలేదని, జనవరి 22న తర్వాత ఏరోజైనా కుటుంబ సభ్యులతో కలిసి తాను అయోధ్యకు వెళ్తానని చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 08:17 PM