Arvind Kejriwal: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:41 AM
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
ఆప్ ఎంపీ బంగ్లాలో మకాం
న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన గతంలో మాట్లాడుతూ తాను ఉంటున్న బంగ్లాను దసరా పర్వదినాల్లో ఖాళీ చేస్తానని ప్రకటించారు.
ఆ మేరకు ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని 6వ నెంబరు బంగ్లాను ఖాళీ చేసి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో మండీ హౌస్ సమీపంలోని ఫిరోజ్‌షా రోడ్‌లో ఉన్న మరో ప్రభుత్వ బంగ్లాకు తరిలి వెళ్లారు. అక్కడ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్ (పంజాబ్)కు కేటాయించిన అధికారిక బంగ్లాలో నివాసం ఉండనున్నారు.