Share News

RSS: రాహుల్ 'కులగణన' వాదనకు ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:28 PM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో సంఘన్ నేత సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడుతూ, పుట్టుక ఆధారంగా కుల నిర్ధారణ జరుగుతుందని, అంతమాత్రన అది మనను వేరుచేయదని అన్నారు.

RSS: రాహుల్ 'కులగణన' వాదనకు ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

జైపూర్: లోక్‌సభ ఎన్నికల నుంచి హర్యానా అసెంబ్లీ వరకూ ఎన్నికల ప్రచారంలో కులగణన (Caste Census) అంశాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంటున్నారు. బీజేపీ ఈ వాదనను కొట్టివేస్తూ హిందువులను విభజించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని చెబుతోంది. ఈ చర్చ నేపథ్యంలో బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ "హిందువుల మధ్య ఐక్యత'' దిశగా పావులు కదుపుతోంది.

PM Modi: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..


హరిద్వార్, జ్యోతిర్లింగాలు ఏ కులానికి చెందినవి?

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో సంఘన్ నేత సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడుతూ, పుట్టుక ఆధారంగా కుల నిర్ధారణ జరుగుతుందని, అంతమాత్రన అది మనను వేరుచేయదని అన్నారు. ''మనకు పేర్లు, భాషలు, దేవుళ్లు, మత గ్రంథాలు ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తుల వారసులమని అనిపించుకుంటాం. వీటికి కులంతో సంబంధం ఏమిటి? ఉందని ఎవరైనా అంటారా? హరిద్వార్ ఏ కులానికి చెందింది? 12 జోతిర్లింగాలు ఏ కులానికి చెందినవి? దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 51 శక్తి పీఠాలు ఫలానా కులానికి చెందినవని చెప్పగలమా?'' అని సురేష్ భయ్యాజీ ప్రశ్నించారు. తమను తాము ఎవరైతే హిందువులుగా భావిస్తుంటారో వారు ఈ రెలిజియస్ ప్లేస్‌లను తమవిగా భావిస్తుంటారని, ఇక విభజన అనేది ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా కులాల హద్దులు మనను విభజించ లేవని స్పష్టం చేశారు. అదే విధంగా పుట్టుక ఆధారంగా విభజన ఉండదన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళానికి కానీ, అనవసర రాద్ధాంతానికి తావు లేదని భయ్యాజీ జోషి వివరించారు.


కులగణనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ గతంలో కండిషనల్ సపోర్ట్ తెలిపింది. ప్రజాసంక్షేమం కోసం కులగణన జరగాలే కానీ రాజకీయ ప్రయోజనాలను ఆశించి జరక్కూడదని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారంలో దీనిపై మాట్లాడుతూ, ముస్లింలలోనూ చాలా కులాలున్నాయని, కానీ కాంగ్రెస్ మాత్రం హిందువులలో కులగణన గురించి మాత్రమే మాట్లాడుతూ హిందువుల మధ్య చీలికకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


For National News And Telugu News

ఇది కూడా చదవండి...

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

Updated Date - Oct 11 , 2024 | 03:28 PM