Ashok Khemka: ఇది కదా నిజాయితీ అంటే.. 33 ఏళ్లలో 57 పోస్టింగ్‌లు, విరమణ 5 నెలల ముందు మరోకటి
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:36 AM
ప్రముఖ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మళ్లీ బదిలీ అయ్యారు. తన పదవీ విరమణకు 5 నెలలకు ముందు కూడా మరో కీలక పదవిని దక్కించుకున్నారు. ఖేమ్కా తన 33 ఏళ్ల కెరీర్‌లో 57 పోస్టింగ్‌లు పొందడం విశేషం.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో అత్యంత నిజాయితీపరుడు, అత్యంత బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన అశోక్ ఖేమ్కా (Ashok Khemka) మళ్లీ బదిలీ అయ్యారు. హర్యానా కేడర్ 1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కాకు ప్రింటింగ్, స్టేషనరీ శాఖ నుంచి రవాణా శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శి పదవిని ఇటివల అప్పగించారు. ఖేమ్కా పదవీ విరమణకు కేవలం ఐదు నెలల ముందు మరో విభాగంలో పోస్టింగ్ పొందడం విశేషం. ఇప్పుడు ఆయన రవాణా శాఖలో 1994 బ్యాచ్ IPS అధికారి నవదీప్ వ్రిక్ స్థానంలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఖేమ్కా తిరిగి రవాణా శాఖకు వచ్చారు.
గతంలో
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో సీనియర్ నేత అనిల్ విజ్‌కు రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చింది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను తమ శాఖలో నియమించాలంటూ ఇటీవల కేబినెట్ మంత్రి అనిల్ విజ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో హర్యానా ప్రభుత్వం రవాణా శాఖలో ఖేమ్కాను నియమించింది. దీనిపై రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ సంతోషం వ్యక్తం చేశారు.
అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఖేమ్కా రవాణా కమిషనర్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలం స్వల్పకాలికం. కేవలం నాలుగు నెలలు మాత్రమే. కానీ ఆ సమయంలో భారీ ట్రక్కులు, ట్రైలర్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను జారీ ఆయన చేయడానికి నిరాకరించారు. దీంతో జనవరిలో ట్రక్ డ్రైవర్ల సమ్మెకు దారితీసింది.
తరచుగా బదిలీ
1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR), 1989 ప్రకారం వారి వాహనాలను సవరించడానికి ట్రక్కు డ్రైవర్లకు ఒక సంవత్సరం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించింది. ఆ సమయంలో రవాణా రంగంలో అవినీతిని పరిష్కరించడానికి తాను చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ, తీవ్రమైన పరిమితులు, స్వార్థ ప్రయోజనాలను ఎదుర్కొవడం గురించి ఖేమ్కా ట్వీట్ చేశారు. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా కెరీర్ తరచుగా బదిలీల ద్వారా గుర్తించబడింది. తరచుగా తక్కువ ప్రాముఖ్యత లేని విభాగాలకు బదిలీ అయ్యారు. ఆయన కెరీర్‌లో ప్రతి ఆరు నెలలకు సగటున బదిలీ కావడం విశేషం. ఇన్ని సవాళ్లు ఎదురైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన కట్టుబడి ఉన్నారు.
33 ఏళ్ల కెరీర్‌లో
హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అశోక్ ఖేమ్కా తన 33 ఏళ్ల కెరీర్‌లో 57 స్థానాల్లో పోస్టింగులు పొందారు. ఈ పదవి కాలంలో ఖేమ్కా నిజాయితీ గల ఐఏఎస్‌గా ఆదర్శంగా నిలిచారు. అశోక్ ఖేమ్కా ఏప్రిల్ 30, 2025న పదవీ విరమణ చేయనున్నారు. 2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన గురుగ్రామ్ ల్యాండ్ డీల్ మ్యుటేషన్‌ను రద్దు చేయడంతో ఖేమ్కా అప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు.
మ్యుటేషన్ అనేది భూమి యాజమాన్య బదిలీలో ఒక భాగం. దీంతోపాటు విజిలెన్స్ బ్యూరోకు అధిపతిగా తన సేవలను అందిస్తానని గత ఏడాది ఖేమ్కా ముఖ్యమంత్రి ఖట్టర్‌కు లేఖ రాశారు. అవకాశం దొరికితే అవినీతిపై నిజమైన యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. జనవరి 23, 2023 నాటి తన లేఖలో అధికారుల మధ్య పనిలో అసమాన పంపిణీ వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News