Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. రెండో వికెట్ సిద్దరామయ్యే..
ABN , Publish Date - Jun 20 , 2024 | 12:46 PM
రాష్ట్రంలో ఏడాది పాలన ముగియగానే తొలి వికెట్‌గా వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో రూ.187కోట్ల అవినీతిలో మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారని, ఇక రెండో వికెట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని ప్రతిపక్షనేత అశోక్(Ashok) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: రాష్ట్రంలో ఏడాది పాలన ముగియగానే తొలి వికెట్‌గా వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో రూ.187కోట్ల అవినీతిలో మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారని, ఇక రెండో వికెట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని ప్రతిపక్షనేత అశోక్(Ashok) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీలు అమలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రజల నుంచి భారీగా పిండుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ద్విచక్రవాహనాన్ని శవం తరహాలో మోసుకెళ్లిన సిద్దరామయ్య ప్రస్తుతం ఎలా ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని ధీమాలో ఉండేవారని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు.
ఇదికూడా చదవండి: Bangalore: రేణుకాస్వామి హంతకులను కఠినంగా శిక్షించాలి..
ఏడాది పాలనలో అభివృద్ధికి ఒకరూపాయి కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. ముద్దెబిహాళ్ ఎమ్మెల్యే నాడగౌడ అభివృద్ధి పనులు కుంటుపడిన విషయాన్ని బహిరంగంగా చెప్పారన్నారు. నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేకుండా పోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులలోనూ అభివృద్ధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో బొమ్మై ముఖ్యమంత్రిగా పదవిని కోల్పోయినప్పుడు రెవెన్యూలోటు లేదని, అప్పులు లేవన్నారు. సిద్దరామయ్య ఏడాదిపాలనలో అప్పులు పెరిగాయని ఆర్థిక పరిస్థితి అధ్వానం చేశారని అన్నారు. ఎందుకోసం పాలన సాగిస్తున్నారో అంటూ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ పెంపుతో సామాన్యులపై భారం మోపారని మండిపడ్డారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News