Share News

Ashwini Vaishnaw: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలుర’ జాబితాలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:23 AM

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ టైమ్‌ మేగజీన్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఏఐ 2024లో అత్యంత ప్రభావశీల ప్రజలు’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Ashwini Vaishnaw: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలుర’ జాబితాలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

  • టైమ్‌ మేగజీన్‌ ప్రశంస

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ టైమ్‌ మేగజీన్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఏఐ 2024లో అత్యంత ప్రభావశీల ప్రజలు’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో ఆయనతో పాటు ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తదితరులు కూడా ఉన్నారు. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో 15 మంది భారతీయులు/భారత సంతతి వ్యక్తులు ఉండడం విశేషం.


వీరిలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నాయకత్వంలో సెమీకండక్టర్‌ తయారీ రంగంలో భారత్‌ టాప్‌ 5 దేశాల్లో ఒకటిగా నిలవనుందని మేగజీన్‌ కొనియాడింది. ఆధునిక ఏఐ సిస్టమ్‌లలో రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్లదే కీలక పాత్ర అని పేర్కొంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో వైష్ణవ్‌ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

Updated Date - Sep 07 , 2024 | 05:23 AM