Share News

Social Media Ban: భారత్‌లో కూడా సోషల్ మీడియాపై నియంత్రణ.. ఆస్ట్రేలియా మోడల్ అమలు చేస్తారా..

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:50 PM

ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్ విధించనున్నారా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల పార్లమెంట్‌‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై చర్చలు, ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Social Media Ban: భారత్‌లో కూడా సోషల్ మీడియాపై నియంత్రణ.. ఆస్ట్రేలియా మోడల్ అమలు చేస్తారా..
Ashwini Vaishnaw on social media

సోషల్ మీడియా (Social Media), ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో లభించే అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలనే ఆందోళన రోజురోజుకు తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. అయితే కఠినమైన చట్టపరమైన నిబంధనలు లేకపోవడంతో వీటిని నడుపుతున్న కంపెనీలు భారతదేశంలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాయి. కానీ ఇటివల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను నియంత్రించడానికి చట్టాలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి పరిమితులు విధిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటివల ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు యువత సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు ఫ్రాన్స్, లండన్ వంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


అభిప్రాయాలను కోరిన మంత్రి

అయితే ఇదే రూల్స్ ప్రస్తుతం ఇండియాలో కూడా అమలు చేయాలని చర్చ మొదలైంది. భారతదేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ సోషల్ మీడియా, OTT ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. ఈ అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలించాలని లోక్‌సభలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అన్నారు. ఈ విషయంలో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.


ప్రశ్నించిన ఎంపీ

లోక్‌సభలో గందరగోళం మధ్య, అరుణ్ గోవిల్ 'OTT ప్లాట్‌ఫారమ్‌లో చూపించేవి చాలా అసభ్యకరంగా ఉన్నాయని అరుణ్ గోవిల్ ప్రశ్నించారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వస్తున్న ఈ కంటెంట్‌ని కుటుంబంతో కలిసి కూర్చుని చూసే పరిస్థితి లేకుండా మారిందన్నారు. దీంతో మన నైతిక విలువలు పతనమవుతున్నాయని గుర్తు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అడల్ట్ కంటెంట్‌ను నిరోధించడానికి ప్రస్తుత విధానం ఏంటో మంత్రి మాకు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగాన్ని నిరోధించడంలో ప్రస్తుత చట్టాలు ప్రభావవంతంగా లేవన్నారు. ప్రస్తుత చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి ప్రభుత్వం ఏ ప్రతిపాదనను కలిగి ఉందని అడిగారు.


ఇక్కడ చట్టం సిద్ధం

ఇటివల ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ బిల్లు ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఎక్స్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు 16 ఏళ్లలోపు పిల్లలు ఈ ఖాతాలను కలిగి ఉన్నట్లు తేలితే ఆయా కంపెనీలపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 274 కోట్లు) వరకు జరిమానా విధించబడుతుంది. ప్రతిపాదిత చట్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి సోషల్ మీడియా కంపెనీలకు ఒక సంవత్సరం సమయం ఇవ్వబడుతుంది. ఆ తర్వాతే వారికి ఆర్థిక జరిమానా విధిస్తారు.


ఇవి కూడా చదవండి:

Priyanka Gandhi Oath: రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రియాంక


Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Nov 28 , 2024 | 12:52 PM