Elections Schedule: 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లకు రెండు విడతల్లో ఉపఎన్నిక
ABN , Publish Date - Oct 15 , 2024 | 06:52 PM
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇదే సమయంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇదే సమయంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలు రెండు విడతల్లో జరుపుతున్నట్టు ప్రకటించింది. తొలివిడతలో భాగంగా నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. రెండో విడతలో భాగంగా నవంబర్ 20న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక, మహరాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉపఎన్నిక ఉంటుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూపీలోని రాయబరేలి నియోజకవర్గాన్ని తన వద్దే ఉంచుకుని, కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని వదులుకోవడంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ ఎంపీ వంసతరావ్ బల్వంతరావ్ చవాన్ గత ఆగస్టులో కన్నుమూయడంతో మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. కాగా, ఉపఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి 9 స్థానాలు, రాజస్థాన్ నుంచి 7, పశ్చిమబెంగాల్ నుంచి 6, అసోం 5, బీహార్, పంజాబ్‌లలో చెరో నాలుగు, కర్ణాటకలో 3, కేరళ, సిక్కిం, మధ్యప్రదేశ్‌లలో రెండేసి స్థానాలు, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటు ఉన్నాయి. నవంబర్ 13న ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నవంబర్ 23న జరుగుతుంది.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి..