PM Modi: వేదికతో పాటు ఒకే దండలో ఇమిడిన మోదీ, నితీష్
ABN , Publish Date - Mar 02 , 2024 | 05:21 PM
ఎన్డీయేలోకి ఇటీవల తిరిగి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారంనాడు ఒకే వేదక పంచుకున్నారు. ప్రధాని సైతం తనకు సమర్పించిన దండను నితీష్‌తో షేర్ చేసుకున్నారు.
ఔరంగాబాద్: ఎన్డీయేలోకి ఇటీవల తిరిగి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో శనివారంనాడు ఒకే వేదక పంచుకున్నారు. ప్రధాని సైతం తనకు సమర్పించిన దండను నితీష్‌తో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.21,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ఔరంగాబాద్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు.
మోదీకి నితీష్ భరోసా
ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి నితీష్ కుమార్ మాట్లాడుతూ, తాను ఎన్డీయేతో ఉన్నానని, ఎక్కడికి వెళ్లేది లేదని చెప్పారు. ''మీరు (మోదీ) ఇంతకుముందు కూడా ఇక్కడకు వచ్చారు. నేను ఇక ఎక్కడికీ వెళ్లేదిలేదని మీకు భరోసా ఇవ్వదలచుకున్నాను. మీతోనే మేము ఉంటాం'' అని చెప్పారు.
డబుల్ ఇంజన్‌తో పటిష్ట బీహార్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంతో కర్పూరి ఠాకూర్‌కు ప్రతిష్ఠాత్మక భారతరత్న పురస్కారం ఇవ్వడం, రామలల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రూ.21,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభిస్తున్నామని, ఇందులో రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన పలు ప్రాజెక్టులతో సహా అనేక ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను పటిష్ట బీహార్‌ను ప్రతిబింబించనున్నట్టు చెప్పారు. ఇదే ఎన్డీయే ఐడెంటిటీ అని చెప్పారు. ''మేము పనులు ప్రారంభిస్తాం, పూర్తిచేస్తాం, ప్రజలకు అంకింతం చేస్తాం. ఇది మోదీ గ్యారెంటీ'' అని అన్నారు. మరోసారి బీహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిందని, తల్లిదండ్రుల నుంచి వారసత్వం పొందవచ్చు కానీ, తమ తల్లిదండ్రుల చేసిన పనుల గురించి చెప్పుకునే ధైర్యం ఉండదని, ఆనువంశిక పాలకుల రాష్ట్రం ఇదని ఆర్జేడీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆనువంశ పాలకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడడానికి ఇష్టపడటం లేదని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. బీహార్ గత జనరేషన్ ప్రజలు భయంతో జీవించేవారని, ఇతర రాష్ట్రాలకు వలసలువెళ్లేవారని, ఆ శకం మళ్లీ రాకూడదని అన్నారు. ఆనువంశపాలకులకు భయం పట్టుకుందని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడి రాజ్యసభ రూట్‌లో పార్లమెంటు చేరుకోవాలనుకుంటున్నారని చురకలు వేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం మూడోసారి అధికారం అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధి, శాంతిభద్రతలు, మహిళా హక్కులకు మోదీ గ్యారెంటీ ఉంటుందని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ అమలు చేయడంతో పాటు అభివృద్ధి చెందిన బీహార్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మోదీ గ్యారెంటీ ఇచ్చారు.