Share News

Baba Siddique: ఖాన్ హీరోల మధ్య సంధాన కర్త, ఖరీదైన జీవితం, లగ్జరీ కార్ల కలెక్షన్

ABN , Publish Date - Oct 13 , 2024 | 04:05 PM

ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది.

Baba Siddique: ఖాన్ హీరోల మధ్య సంధాన కర్త, ఖరీదైన జీవితం, లగ్జరీ కార్ల కలెక్షన్

ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది. 67 ఏళ్ల సిద్ధిఖి రాజకీయాల్లో ప్రముఖుడే కాకుండా బాలీవుడ్‌ సెలబ్రెటీస్‌తోనూ మంచి స్నేహసంబంధాలు సాగించేవారు. విలాసవంతమైన లైఫ్ స్టయిల్‌తో పాటు లగ్జరీ కార్లను సేకరించడంలోనూ ఆయన ముందుండే వారు. రూ.76 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Maharashtra: మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య.. స్పందించిన రాహుల్ గాంధీ

సిద్ధికి ఏటా ఇచ్చే ఇఫ్తార్ విందుకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా పోటీపడి హాజరయ్యేవారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు ఈ ఆత్మీయ అతిథ్యంలో పాల్గొనేవారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడల్లా ఆయన సంధాన కర్తగా వ్యవహరించి వారిని తిరిగి కలుపుతుండేవారు.

ఇక సంపాదనపరంగా చూసినప్పుడు, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.76 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు సిద్ధిఖి ప్రకటించారు. 2004లో రూ.12 కోట్ల ఆస్తులుండగా, 2009లో అది రూ.25 కోట్లకు చేరింది. రూ.23.58 కోట్ల రుణాలు ఉన్నట్టు కూడా ఆయన డిక్లేర్ చేశారు. లగ్జరీ కార్లంటే బాగా మోజుపడేవారు. 2014లో రూ.31 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంచ్ ఎ180 స్పోర్ట్ ఉండేది. ఆయన భార్యకు రూ.86.54 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంచ్ ఎస్ క్లాస్ 350 ఎల్ ఉండేది. సిద్ధిఖికి సొంతంగా బీఎండబ్లూ సిరీస్, రోల్స్ రాయస్ ఫాంటమ్ కూడా ఉందంటారు. 2014లో సిద్ధిఖి, ఆయన బార్యకు రూ.6 కోట్ల విలువైన జ్యూయెలరీ ఉంది. బాంద్రాలో రూ.4 కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీ ఆయనకు ఉంది. అదనంగా మరో కోటి 91 లక్షల ఆస్తులున్నాయి. బాంద్రాలో భార్యాభర్తలకు రూ.3 కోట్ల 15 లక్షలు విలువచేసే రెసిడెన్షియర్ ప్రాపర్టీలు ఉన్నాయి. బాంద్రా, కలిన, శాంతాక్రుజ్ ఈస్ట్‌లో ఆయన భార్య పేరిట పలు ఆస్తులు కూడా ఉన్నాయి.

బీహార్‌లో పుట్టిన సిద్ధికి చిన్నప్పుడే ముంబై వచ్చేశారు. సెయింటేన్స్ హైస్కూలులో పాఠశాల విద్య, ఎంఎంకే కాలేజీలో బీకామ్ డిగ్రీ చేసారు. ఆయితే కాలేజీ విద్యను ఆయన పూర్తి చేయలేదంటారు. 12వ తరగతి ప్యాస్ అయినట్టు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. విద్యార్థి నేతగా కెరీర్ ప్రారంభించి మున్సిపల్ కార్పొరేటర్‌గా రెండుసార్లు పనిచేశారు. 1999లో తొలిసారిగా బాంద్రా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. తిరిగి 2004, 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.

Read More National News and Latest Telugu News

ఈ వార్తలు కూడా చదవండి:

Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Updated Date - Oct 13 , 2024 | 04:09 PM