Share News

Zeeshan Siddique: పోరాటం ముగియలేదు.. సింహం రక్తం నా నరనరాల్లో ఉంది

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:09 PM

ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించడం, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు జీషన్ సిద్ధిఖీ కూడా హంతకుల టార్గెట్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో జీషన్ సిద్ధిఖీ తొలిసారి స్పందించారు.

Zeeshan Siddique: పోరాటం ముగియలేదు.. సింహం రక్తం నా నరనరాల్లో ఉంది

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించడం, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు జీషన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా హంతకుల టార్గెట్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం "ఎక్స్''లో జీషన్ సిద్ధిఖీ తొలిసారి స్పందించారు. తన తండ్రిని హత్య చేయడంతో యుద్ధం ముగిసినట్టు కాదని అన్నారు. తాను బతికే ఉన్నానని, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతానని, అందుకు సిద్ధంగా ఉన్నానని, తాను సింహం తనయుడనని పేర్కొన్నారు.

Eknath Shinde: గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడి నియామకంపై సీఎం యూట్నర్


''వాళ్లు (హంతకులు) నా తండ్రి నోటిని శాశ్వతంగా మూయించేశారు. కానీ ఆయన సింహం (lion) అనే విషయం మరించిపోయారు. ఆయన సింహగర్జన నేను కొనసాగిస్తాను. ఆయన పోరాటం నా నరనరాల్లో జీర్ణించుకుంది. ఆయన న్యాయానికి దన్నుగా ఉండేవారు. మార్పు కోసం పోరాడారు. పెనుతుఫానులకు కూడా చెక్కుచెదరని ధైర్యం ఆయనది. ఆయన ప్రాణాలు తీసినవారు తామేదో గెలిచామనుకుని నా మీద దృష్టి సారించాలని అనుకుంటే వారికి నేను చెప్పదలచుకున్నదొకటే. సింహం రక్తం నా నరనరాల్లోనూ ప్రవహిస్తోంది" అని జీషన్ సిద్ధిఖీ తన పోస్ట్‌లో తెలిపారు.


భయపడే ప్రసక్తే లేదు

తాను ఎవరికీ (హంతకులకు) భయపడం కానీ, వెనుకంజ వేసేది కానీ లేదని జీషన్ సిద్ధిఖీ తెలిపారు. ''వారు ఒకరిని (తన తండ్రి) తీసుకువెళ్లారు. కానీ ఆయన స్థానంలో నేను ఎదిగాను. పోరాటం ఇప్పడిప్పుడే ముగిసేది కాదు. నాన్న గారున్న చోటే నేను ఇప్పడు ఉన్నాను. అలైవ్, రెలెంట్‌లెస్, రెడీ...'' అని అన్నారు. పేద ప్రజల జీవితాలు, గృహాల పరిరక్షణ కోసం తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు తమ కుటుంబం దుఃఖంలో మునిగిపోయిందని, న్యాయం జరగాలని తమ కుటుంబం కోరుకుంటోందని అన్నారు.


ముంబైలోని తన నివాసం వద్ద బాబా సిద్ధిఖిని ముగ్గురు దుండగులు ఇటీవల కాల్చిచంపారు. వీరిలో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. జీషన్ సిద్ధిఖి సైతం హంతుకల టార్గెట్‌లో ఉన్నట్టు పట్టుబడిన నిందితులు వాంగూల్మం ఇచ్చారు. నిందితులకు మారణాయుధాలు సరఫరా చేసిన ఐదుగురు వ్యక్తులను కూడా గత వారంలో పోలీసులు అరెస్టు చేశారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Union Minister: మరోసారి నేనే సీఎం.. సిద్దూ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదు

Updated Date - Oct 20 , 2024 | 08:09 PM