Share News

Jharkhand: చంపయి సోరెన్ బీజేపీలోకి రావడంపై మాజీ సీఎం గుస్సా

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:53 PM

జార్ఖాండ్ ముక్తి మోర్చా తిరుగుబాటు నేత చంపయీ సోరెన్ బీజేపీలోకి రానుండటంపై బీజేపీ జార్ఖాండ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశాలున్నాయి.

Jharkhand: చంపయి సోరెన్ బీజేపీలోకి రావడంపై మాజీ సీఎం గుస్సా

న్యూఢిల్లీ: జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) తిరుగుబాటు నేత చంపయీ సోరెన్ (Champai Soren) బీజేపీలోకి రానుండటంపై బీజేపీ జార్ఖాండ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి (Babulal Marandi) అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలిసే అవకాశాలున్నాయి. అయితే, ఢిల్లీకి రావడానికి ముందు మాత్రం ఆయన మీడియాతో చంపయీ సోరెన్ బీజేపీలోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని చెప్పారు.


కాగా, చంపయీ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నట్టు అసోం ముఖ్యమంత్రి, జార్ఖాండ్ బీజేపీ ఇన్‌చార్జి హిమంత్ బిస్వా శర్మ సోమవారంనాడు ప్రకటించారు. జేఎంఏలో చంపయీ సోరెన్ అవమానానికి గురైనట్టు చెప్పారు. సోరెన్ సైతం గత రెండు వారాలుగా ఢిల్లీలోనే క్యాంప్ చేశారు. హోం మంత్రి అమిత్‌షాను కలుసుకున్న అనంతరం బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ''ఈనెల 18న ఢిల్లీకి వచ్చినప్పుడు నా నిర్ణయం చాలా స్పష్టంగా చెప్పారు. తొలుత రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకున్నాను. కానీ, ప్రజల మద్దతు చూసిన తర్వాత రిటైర్మెంట్ ఆలోచన వెనక్కి తీసుకున్నాను. బీజేపీలో చేరుతాను'' అని చెప్పారు.

Jharkhand: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు తేదీ ఖరారు


మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టుతో జార్ఖాండ్ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంపయీ సోరెన్ ఆ తర్వాత ఐదు నెలలకు హేమంత్ సోరెన్ బెయిలుపై విడుదల కాగానే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో హేమంత్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ చర్యతో చంపయీ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారని, బీజేపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జరిగింది. చంపయీ తొలుత ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినా ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 81 మంది సభ్యుల జార్ఖాండ్ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 07:55 PM