Bangalore: రాష్ట్రంలో 623 మంది నకిలీ వైద్యులు..
ABN , Publish Date - Oct 26 , 2024 | 01:23 PM
రాష్ట్రంలో నకిలీ వైద్యుల(Fake doctors) బెడద తీవ్రంగా మారింది. దేశంలోనే అత్యధికంగా మెడికల్ కళాశాలలు కల్గిన రాష్ట్రాల్లో ఒకటిగా రాష్ట్రానికి పేరుంది. ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సేవలందిస్తున్నాయి. బెంగళూరు, మైసూరు, దావణగెరె, బెళగావి, బాగల్కోటె, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలన్నాయి.
- కోలారు, విజయపుర, తుమకూరులోనే అధికం
- కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
బెంగళూరు: రాష్ట్రంలో నకిలీ వైద్యుల(Fake doctors) బెడద తీవ్రంగా మారింది. దేశంలోనే అత్యధికంగా మెడికల్ కళాశాలలు కల్గిన రాష్ట్రాల్లో ఒకటిగా రాష్ట్రానికి పేరుంది. ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సేవలందిస్తున్నాయి. బెంగళూరు, మైసూరు, దావణగెరె, బెళగావి, బాగల్కోటె, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలన్నాయి. దశాబ్దాల క్రిందట ఏర్పాటైన మెడికల్ కళాశాలల ద్వారా వేలాదిమంది వైద్యులు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఉన్నత హోదాల్లో ఉన్నారు. అటువంటి రాష్ట్రంలోనూ నకిలీ వైద్యుల బెడద వెంటాడుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: BJP: పార్టీ ఎంతో ఇచ్చింది.. కొంతైనా తిరిగిచ్చేద్దాం
వైద్య ఆరోగ్యశాఖ ఈ ఏడాది 623మంది నకిలీ వైద్యులను గుర్తించింది. కోలారు, విజయపుర, తుమకూరు(Kolaru, Vijayapura, Tumkur) ప్రాంతాల్లోనే బోగస్ డాక్టర్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో తరచూ సంచలనం కలిగించేలా భ్రూణహత్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసింది. మండ్యతోపాటు పలు ప్రాంతాల్లో ఆసుపత్రి, ల్యాబ్ ఆనవాళ్లు లేనటువంటిచోట్ల కేంద్రాలను ఏర్పాటు చేసుకుని భ్రూణహత్యలు జరుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరికి కొన్ని ల్యాబ్‌లు సహకరిస్తున్నట్లు గుర్తించారు. 2వేలకుపైగా నకిలీ క్లినిక్‌లు, ల్యాబ్‌లకు తాళాలు వేసిన విషయం తెలిసిందే.
ఏది నకిలీ..? ఏది అసలు..?
అలోపతి వైద్యవృత్తి చేసేవారికి కర్ణాటక మెడికల్ కౌన్సిల్ (కేఎంసి) లేదా కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ యాక్ట్ (కేపీఎంఈఐ) నిబంధనల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయుష్ వైద్యులైతే ఆయుష్ బోర్డు లేదా కర్ణాటక ఆయుర్వేద యునాని ప్రాక్టీసనర్స్ అసోసియేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు అలోపతి లేదా ఆయుర్వేద విభాగం నుంచి ప్రత్యేకమైన నెంబరు కేటాయిస్తారు. వాటిని క్లినిక్‌లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇలా రెండు విభాగాలనుంచి రిజిస్ట్రేషన్ చేయించకుండా వైద్యం చేసేవారంతా నకిలీలుగా వైద్య ఆరోగ్యశాఖ పరిగణిచింది.
రాష్ట్రంలో వైద్యులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 35,132లమంది, పట్టుబడిన నకిలీ వైద్యులు 623మంది, ఇక నోటీసులు జారీ చేసింది 163మందికి కాగా 193 క్లినిక్‌లను సీజ్ చేశారు. 89 మందికి జరిమానా విధించారు. 36మంది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో నకిలీల బెడద తీవ్రం కావడంతో వీరి వైద్యవిధానం ద్వారా తరచూ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జిల్లాలవారీగా బృందాలను ఏర్పాటు చేసి దాడులు జరిపించింది. దాడుల్లో 623మంది పట్టుబడ్డారు.
కోలారులోనే అత్యధికం
రాష్ట్రంలో నకిలీ వైద్యులు లేని జిల్లాలు లేవు. ఇందులో 2023 నుంచి 2024 సెప్టెంబరు వరకు జరిపిన దాడుల్లో కోలారులో 115మంది నకిలీ వైద్యులను గుర్తించారు. తుమకూరులో 84, విజయనగరలో 81, కలబురగిలో 64మంది పట్టుబడగా మిగిలిన జిల్లాల్లో కొంత మెరుగు అనిపిస్తుంది. దక్షిణకన్నడలో 17మంది, కాగా ప్రతి జిల్లాల్లోనూ పదిమందికి అటుఇటుగా పట్టుబడ్డారు. భ్రూణహత్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత నకిలీ వైద్యుల గురించి చర్యలకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. అంతకంటే ముందుగానే నకిలీల గురించి ఆరా తీసి ఉంటే వందలాదిమంది పసికందుల ప్రాణాలను కాపాడినవారయ్యేవారు.
తొలిసారి నకిలీ వైద్యులు పట్టుబడితే రూ.25వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.2.5లక్షలు, ఏడాదిపాటు జైలుశిక్ష, మూడోసారి పట్టుబడితే రూ.5లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలాంటి చట్టాలు ఉన్నాయి. పట్టుబడినవారిలో అలోపతికి బదులుగా ఇతర వైద్య విభాగాలకు చెందినవారే ఉన్నారు. కొందరు వైద్యుల వద్ద కొంతకాలం పనిచేసినవారు, ఆయుర్వేద, యునాని కోర్సులు చేసి అలోపతి వైద్యవిధానం పాటిస్తున్నవారు ఉన్నారు. ఇకపై ఏటా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యుల దందాను అరికట్టేందుకు జిల్లాలవారీగా కమిటీలు పనిచేసేలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్
ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!
ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News