Bangalore: ఏనుగుల కదలికలపై డ్రోన్ల నిఘా..
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:06 PM
అటవీప్రాంతాల ఆక్రమణలు పెరిగిపోతుండడంతో వన్యప్రాణులకు తగిన ఆహార లభించక శివారుప్రాంతాలలోని ప్రజల నివాసాలు, పంట పొలాలవైపు చొచ్చుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలికాలంలో ఏనుగులనుంచి పంట పొలాలకే కాకుండా కూలీ కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది.
- బెంగళూరు గ్రామీణ జిల్లాలో ప్రయోగాత్మకం
- రాష్ట్రమంతటా విస్తరణకు కసరత్తు
బెంగళూరు: అటవీప్రాంతాల ఆక్రమణలు పెరిగిపోతుండడంతో వన్యప్రాణులకు తగిన ఆహార లభించక శివారుప్రాంతాలలోని ప్రజల నివాసాలు, పంట పొలాలవైపు చొచ్చుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలికాలంలో ఏనుగులనుంచి పంట పొలాలకే కాకుండా కూలీ కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది. తరచూ పంటపొలాలపై దాడులు చేసే ఏనుగులు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేస్తున్నాయి. మరోవైపు ఉదయం సాయంత్రం వేళల్లో రైతులు, కూలీ కార్మికులపై దాడిచేసి చంపేస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Home Minister: హోంమంత్రి అంతమాట అనేశారేంటో.. వారిద్దరే రాజకీయాలు చేసుకోనీ...
తరచూ ఏనుగుల దాడులు మైసూరు, రామనగర, బెంగళూరు గ్రామీణ, హాసన్(Mysore, Ramanagara, Bangalore Rural, Hassan)తోపాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్నాయి. ఏనుగుల దాడినుంచి రక్షణ కల్పించాలని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలో పంట పొలాలవైపు ఏనుగులు చొచ్చుకు వచ్చే విషయాన్ని ముందుగా గుర్తించేందుకు డ్రోన్ టెక్నాలజీ సముచితమని బెంగళూరు గ్రామీణ బీజేపీ ఎంపీ డాక్టర్ సీఎన్ మంజునాథ్ అన్నారు.
అందుకు అనుగుణంగా అటవీశాఖ అధికారులతో డ్రోన్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గ్రామీణ పరిధిలో బన్నేరుఘట్ట, కోడిహళ్లి, సాతనూరు, మాగడి, చన్నపట్టణతోపాటు పలు ప్రాంతాలలో ఏనుగులు పొలాలపై దాడుల విషయాన్ని ఎంపీ గుర్తించారు. అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపి కోడిహళ్లి పరిధిలోని బొమ్మసంద్ర అటవీప్రాంతంలో డ్రోన్ సాంకేతికతను ప్రయోగించారు. ఇటీవల 25 ఏనుగులు అడవినుంచి పంట పొలాలవైపు వస్తుండడాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి కార్యాచరణ జరిపి ఏనుగులను అటవీప్రాంతాలవైపు మళ్లించారు.
ఎనుగుల కదలికలపై నిఘా..!
గడిచిన 12రోజులుగా కార్యాచరణ కొనసాగించారు. వార్ రూం ద్వారా ఏనుగుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ ప్రయోగం సత్ఫలితం ఇచ్చింది. 6 డ్రోన్‌ల ద్వారా 24 గంటలపాటు అటవీ సరిహద్దు, పంట పొలాలు, గ్రామీణ ప్రాంత శివారులలో కెమెరాల ద్వారా గుర్తించారు. సాధారణంగా ప్రస్తుతం ఖరీ్‌ఫలో సాగు చేసిన పంటలు చేతికొచ్చినవేళ ఏనుగులు దాడి చేస్తాయి. పంట పొలాల రుచి మరిగితే ఏనుగులు ఇక నిత్యం వస్తుంటాయి. ప్రారంభంలోనే వాటిని రాకుండా కట్టడిచేస్తే నియంత్రణ సాధ్యమని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
డ్రోన్‌లలో అత్యాధునిక రెసొల్యూషన్ కల్గిన కెమెరాలను ఉపయోగించి నిరంతం నిఘా పెడతారు. వార్ రూం ద్వారా ఏనుగుల సంచారాన్ని గుర్తించారు. ఒకవేళ అటవీప్రాంత శివారులోని పల్లెలు, పొలాలవైపు ఏనుగులు వస్తున్నట్లు గుర్తిస్తే వార్ రూం ద్వారా అటవీశాఖ అధికారులతోపాటు ఈ ప్రాంత రైతులను అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగం ద్వారా మనుషుల ప్రాణాలను రక్షించడం, పంటలపై దాడులు జరగకుండా అరికట్టడం, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు వీటలుంటుందని ఎంపీ అంటున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అటవీశాఖ భావిస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News