Bangalore: బట్టలు సరిగా వేసుకోకుంటే యాసిడ్ పోస్తా..
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:23 PM
‘మీ భార్యను సరిగా బట్టలు వేసుకోమనండి. లేదంటే ఆమె ముఖంపై యాసిడ్ పోస్తా’ అని బెదిరించిన వ్యక్తిని ఓ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. బెంగళూరు నగరానికి చెందిన శెహబాజ్ అన్సార్(Sehbaz Ansar) అనే వ్యక్తికి ఈ నెల 9న ఓ మెసేజ్ వచ్చింది.
- సహోద్యోగికి బెదిరింపులు
- ఉద్యోగం నుంచి తొలగింపు
బెంగళూరు: ‘మీ భార్యను సరిగా బట్టలు వేసుకోమనండి. లేదంటే ఆమె ముఖంపై యాసిడ్ పోస్తా’ అని బెదిరించిన వ్యక్తిని ఓ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. బెంగళూరు నగరానికి చెందిన శెహబాజ్ అన్సార్(Sehbaz Ansar) అనే వ్యక్తికి ఈ నెల 9న ఓ మెసేజ్ వచ్చింది. తన భార్య పనిచేసే సంస్థలోనే పనిచేస్తున్న నిఖిత్ శెట్టి అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినట్లు శెహబాజ్ గుర్తించారు. ఆ మెసేజ్ స్ర్కీన్‌షాట్‌ను సీఎం, డీసీఎం, డీజీపీకి సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Train Accident: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!
తన భార్య బట్టల గురించి ప్రశ్నించిన ఆ వ్యక్తి యాసిడ్ పోస్తానని బెదరిస్తున్నారని, అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శెహబాజ్ పోస్ట్ చేశారు. ఆ సంస్థలో మహిళలకు రక్షణ లేదని అనిపిస్తోందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో నిఖిత్‌శెట్టిని కంపెనీ నుంచి తొలగించారు. దీంతో శెహబాజ్ ఆ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. బెదిరించిన వ్యక్తికి కంపెనీ తగిన గుణపాఠం చెప్పిందని, పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవాలని మరోసారి పోస్ట్ చేశారు.
.
.........................................................
ఈ వార్తను కూడా చదవండి:
...........................................................
Chief Minister: ఇక మీ ఇష్టం..! నేనేం చేయలేను
- రహస్య భేటీలపై సీఎం హెచ్చరిక
- కఠిన చర్యలకు సిద్ధమవుతున్న అధిష్టానం
బెంగళూరు: రహస్య సభలు, వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు ముఖ్యమంత్రి మార్పు అనే అంశంపై అధిష్టానం సీరియస్‌గా ఉందని, వారు చర్యలు తీసుకుంటే నేను బాధ్యుడిని కాదని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) కేబినెట్ సహచరులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రారంభంలోనే సీఎం సిద్దరామయ్య ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. బెంగళూరులో పరమేశ్వర్, మహదేవప్ప, సతీశ్ జార్కిహొళిల భేటీ, మైసూరులో సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్ పలువురు ఎమ్మెల్యేలతో కలయిక వంటి అంశాలపై అధిష్టానం ఇప్పటికే తీవ్రంగా మండిపడిన విషయాన్ని ప్రస్తావించారు. పార్టీలో గందరగోళానికి అవకాశం ఇవ్వరాదన్నారు. రాజకీయ అంశాలు చర్చించలేదని పరమేశ్వర్ ప్రస్తావించారు.
అయినా అధిష్టానం సీరియస్‌గా ఉందని, వారు చర్యలు తీసుకుంటే తాను బాధ్యుడిని కాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారికి నోటీసులు జారీ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల డీకే శివకుమార్ బెంగళూరు సదాశివనగర్‌లో ఖర్గేను భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వాటిద్వారానే సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఓ పోస్ట్ వెల్లడైంది. దీంతో బీకే హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News