Share News

Bangalore: జూలై 12న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

ABN , Publish Date - Jun 19 , 2024 | 01:00 PM

శాసనసభ్యుల కోటాలో విధానపరిషత్‌ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్‌ శెట్టర్‌(Jagdish Shettar) రాజీనామాతో ఖాళీ అయిన ఒక స్థానానికి జూలై 12న ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది.

Bangalore: జూలై 12న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

- శెట్టర్‌ రాజీనామాతో ఒక్క స్థానం ఖాళీ

- శాసనసభ్యుల కోటాలో ఎన్నిక

బెంగళూరు: శాసనసభ్యుల కోటాలో విధానపరిషత్‌ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్‌ శెట్టర్‌(Jagdish Shettar) రాజీనామాతో ఖాళీ అయిన ఒక స్థానానికి జూలై 12న ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్‌ జారీ కానుండగా అదే రోజు నుంచే నామినేషన్ల స్వీకరిస్తారు. జూలై 2వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా 3న పరిశీలనలకు, 5వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్‌ కొనసాగనుంది. అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జగదీశ్‌ శెట్టర్‌కు 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ(BJP) టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

ఇదికూడా చదవండి: DCM: ఈవీఎంల వల్లే ఆ రెండుపార్టీలకు ఎక్కువ స్థానాలు వచ్చాయి..


ఆ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేల కోటాలో విధానపరిషత్‌కు ఎన్నికయ్యారు. 2028 జూన్‌ 14దాకా ఆయన పదవీకాలం ఉంది. ఈ ఏడాది జనవరి 25న శెట్టర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అయ్యారు. శెట్టర్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. కాగా ఈ స్థానానికి బసనగౌడ బాదర్లికి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఖరారు చేసింది. ఎమ్మెల్యేల కోటా ప్రకారం బసనగౌడ బాదర్లి సునాయాసంగానే గెలుపొందనున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 19 , 2024 | 01:02 PM