Bangalore: పరిషత్‌కు యతీంద్ర, సుమలత పేర్లు ఖరారు..?
ABN , Publish Date - Jun 02 , 2024 | 12:32 PM
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియకు కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP)లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇరు పార్టీల రాష్ట్రనేతలు అధిష్ఠానంకు జాబితాలు పంపి చేతులు దులుపుకున్నారు.
బెంగళూరు: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియకు కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP)లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇరు పార్టీల రాష్ట్రనేతలు అధిష్ఠానంకు జాబితాలు పంపి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఏడుగురిని ఎన్నుకునేందుకు వీలుండగా ఏకంగా 65 మందికిపైగా పోటీ చేస్తుండడంతో మల్లగుల్లాలు పడుతు న్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తోపాటు పలువురిని భేటీ అ య్యారు. రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆమోదముద్ర పడలేదు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సీఎం సిద్దరామయ్యకు వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేసిన కుమారుడు యతీంద్రకు, పరిషత్‌కు పంపేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది.
ఇదికూడా చదవండి: Chennai: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3,000 మంది పోలీసులు
ఇక బీజేపీలోనూ ఇదే పరిస్థితి కొన సాగు తోంది. మండ్య ఎంపీ టిక్కెట్ త్యాగం చేసినందుకు ఎంపీ సుమలత(MP Sumalatha)కు పరిషత్‌కు ఎంపిక చేయాలని అధిష్ఠానం సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి ముగ్గురిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంది. అయితే పేర్లను ప్రకటించే విషయంలో అధిష్ఠానం ఆచితూచి వ్యవ హరిస్తోంది. మండ్య ఇండిపెండెంట్ ఎంపీగా గెలుపొందిన సుమలత ఆ తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయ దలిచారు. జేడీఎస్‌తో పొత్తు కుదరడంతో మండ్య టిక్కెట్ జేడీఎస్ కోటాకు చేరింది. బీజేపీ పెద్దలు సూచన మేరకు ఆమె పోటీకి వెనుకడుగు వేశారు. దీంతో బీజేపీ జా తీయ నేతలు సుమలత కు పరిషత్ హోదా కల్పించదలిచారు. ఒక్కో ఎమ్మెల్సీ విజయానికి 19మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News