Bangalore: జిల్లా ఎమ్మెల్యేల తీర్మానం.. కలబురగి నుంచే ఖర్గే పోటీ చేయాలి
ABN , Publish Date - Feb 24 , 2024 | 01:36 PM
కలబురగి లోక్‌సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పోటీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు తీర్మానించారు.
బెంగళూరు: కలబురగి లోక్‌సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పోటీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు తీర్మానించారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో గురువారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రులు ప్రియాంక ఖర్గే, శరణ ప్రకాశ్ పాటిల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఖనీజా ఫాతిమా, అల్లమప్రభు పాటిల్, అజయ్‌సింగ్, ఎమ్మెల్సీ తిప్పణ్ణ కమకనూరుతోపాటు పలువురు పాల్గొన్నారు. కలబురగి నుంచి సుదీర్ఘకాలంగా ఖర్గే పోటీ చేస్తున్నారని, మరోసారి అక్కడి నుంచే నిలబడాలని తీర్మానించారు. ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ నాయకులంతా మల్లికార్జున ఖర్గేకు మద్దతు తెలిపారు.