Bangalore to Ayodhya: బెంగళూరు టు అయోధ్య.. రికార్డు స్థాయిలో విమాన టికెట్ల ధర
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:52 AM
అయోధ్యలో ఈ నెల 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరగుతుండంతో బెంగళూరు నుంచి బయల్దేరే రైళ్ళు, విమానాలు, బస్సులకు భారీ డిమాండ్ పెరిగింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో ఈ నెల 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరగుతుండంతో బెంగళూరు నుంచి బయల్దేరే రైళ్ళు, విమానాలు, బస్సులకు భారీ డిమాండ్ పెరిగింది. బెంగళూరు నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యను త్వరగా చేరుకునేందుకు విమానం ఒక్కటే మార్గం కావడంతో వీటి టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. బెంగళూరు నుంచి అయోధ్య(Bangalore to Ayodhya)కు ఈ నెల 19 నుంచి 21 వరకు బయల్దేరి వెళ్ళే విమానాల టికెట్ల ధర సుమారుగా రూ 24వేల నుంచి రూ 30వేలుగా ఉండటం విశేషం. ఇదొక రికార్డు కానుందని ఎయిర్‌పోర్టు వర్గాలు గురువారం మీడియాకు వెల్లడించాయి. మామూలు రోజులతో పోలిస్తే ఈ చార్జీ ఏకంగా 400 శాతం అధికం కా వడం గమనార్హం. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరే విమానం అహ్మదాబాద్‌లో ఐదుగంటల విరామం అనంతరం అయోధ్యకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. రైల్లో ప్రయాణం అయితే దాదాపు రెండు రోజుల సమయం పడుతుండంతో అందరూ విమానప్రయాణం వైపే మొగ్గు చూపు తున్నారు.