Bangalore: అయోధ్య రాముడికి బెంగళూరు నుంచి తులసి మాల
ABN , Publish Date - Jan 20 , 2024 | 01:48 PM
అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు నగరం జయనగర్‌కు చెందిన డాక్టర్ శివరాజ్‌కుమార్ శ్రీరాముడికి తులసి సేవ చేయదలచారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు నగరం జయనగర్‌కు చెందిన డాక్టర్ శివరాజ్‌కుమార్ శ్రీరాముడికి తులసి సేవ చేయదలచారు. అయోధ్యకు సుమారు 60 కిలోమీటర్ల దూరాన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో గుజరాత్ తులసీవనం నుంచి విత్తనాలు తీసుకెళ్ళి సాగు చేశారు. ప్రస్తుతం తులసి మొక్కలు పెరిగాయి. బెంగళూరులో పూల అల్లికలలో అనుభవం కలిగిన ముగ్గురు యువకులను ఇటీవలే విమానంలో అయోధ్యకు పంపారు. 17న బుధవారం నుంచి ఆలయానికి నిత్యం తులసితో రూపొందించిన ప్రత్యేకమైన హారాలు తదితరాలను పంపారు. ఈనెల 22న రామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట రోజున ప్రత్యేకమైన తులసి హారం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరాముడికి తులసీ సేవ చేసుకునే సౌభాగ్యం దక్కిందని డాక్టర్ శివరాజకుమార్‌కు ప్రకటించారు.