Share News

Bangalore: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం..

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:29 PM

బెంగళూరులో అమెరికా రాయబార కార్యాలయం స్థాపించడం చారిత్రాత్మక మైలురాయి అని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య(Bangalore South MP Tejaswisurya) అభిప్రాయ పడ్డారు.

Bangalore: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం..

బెంగళూరు: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం స్థాపించడం చారిత్రాత్మక మైలురాయి అని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య(Bangalore South MP Tejaswisurya) అభిప్రాయ పడ్డారు. జనవరి రెండోవారంలో రాయబార కార్యాలయం స్థాపిస్తు న్నట్టు అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ప్రకటించడం సంతోషకరమన్నారు. ఈమేరకు తేజస్విసూర్య(Tejaswisurya) కార్యాలయం శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: MLA: సినిమా హీరోలకు ఉన్న గౌరవం తల్లిదండ్రులకు లేదు..


బెంగళూరు ప్రజల సుదీర్ఘ కాల డిమాండ్‌కు అంతిమరూపం లభించిందన్నారు. 2019లోనే బెంగళూరులో రాయబార కార్యాలయం ఏర్పాటుకు డిమాండ్‌ చేశామన్నారు. దేశంలోనే ఐటీ ఆదాయంలో 40శాతం కర్ణాటక(Karnataka) నుంచే సాధ్యమని, ఇక్కడ ఐటీ నిపుణులు లక్షలమంది ఉన్నార న్నారు. అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటు కావడం ద్వారా యూఎస్‌ వీసా పనులకు చెన్నై(Chennai) లేదా హైదరాబాద్‌(Hyderabad) వెళ్లే పరిస్థితి తప్పినట్టు అవుతుందన్నారు.


pandu3.2.jpg

అమెరికాకు చెందిన 370 కంపెనీ లతోపాటు 750 ఎంఎన్‌సీలు బెంగళూరులో ఉన్నాయని వారందరికీ అను కూలం కానుందన్నారు. యూఎస్‌ రాయబారులు కెన్నత్‌ జెస్ట న్‌, ఎరిక్‌ గార్సెట్టిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఐటీ బీటీశాఖల మంత్రి ప్రియాంక ఖర్గే ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 12:32 PM