Share News

Bangladesh: షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:54 PM

షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితిలో ఆదేశం విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్‌లోని మంత్రులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యూనల్ (ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Bangladesh: షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై దాడుల వ్యవహారంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు అధికారికంగా లేఖ రాసింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను తమకు అప్పగించాలని కోరింది. ఈ విషయమై భారత్‌కు డిప్లొమేటిక్ నోట్ పంపినట్టు ఆదేశ విదేశాంగ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సేన్ తెలిపారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను విచారించాల్సి ఉందని అన్నారు.

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ


షేక్ హసీనా గత ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితిలో ఆదేశం విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందారు. ఈ క్రమంలోనే హసీనాతో పాటు ఆమె కేబినెట్‌లోని మంత్రులు, సలహాదారులు, మిలటరీ, సివిల్ అధికారులపై ఢాకాలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యూనల్ (ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది.


దౌత్య ఒప్పందం ఉంది

హసీనాను అప్పగించాల్సిందిగా భారత్‌కు దౌత్యపరమైన నోట్ పంపినట్టు బంగ్లా హోం అడ్వయిజర్ జహంగీర్ ఆలమ్ వెల్లడించారు. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి ఢాకా-న్యూఢిల్లీ మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. గత నెలలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ ముహమ్మద్ యూనస్ సైతం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, హసీనాను అప్పగించాల్సిందిగా భారత్‌ను కోరనున్నట్టు పేర్కొన్నారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులు, వర్కర్లు సహా 1.500 మంది ప్రాణాలు కోల్పోయారని, 19,981 మంది గాయపడ్డారని తెలిపారు. ఆందోళనల్లో మరణించిన ప్రతి ఒక్కరూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కాగా, వ్యక్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంలో ఏదైనా నిబంధనను అడ్డుపెట్టుకుని హసీనాను బంగ్లాకు పంపేందుకు భారత్ నిరాకరిస్తే గట్టి నిరసన తెలుపుతామని న్యాయశాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ గత అక్టోబర్‌లో పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో ఇటీవల జరుగుతున్న హిందువులు, మైనారిటీలపై దాడులను హసీనా తప్పుప్టటారు. తనను గద్దెదింపిన తర్వాత జరుగుతున్న ఈ దాడులను నిరోధించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఇది కూడా చదవండి..

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 05:55 PM