పాక్‌కు బంగ్లా మరింత చేరువ!
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:39 AM
పాకిస్థాన్ మారణహోమాలను అడ్డుకుని.. తన ఆవిర్భావానికి సహకరించిన భారత్ భద్రతకే బంగ్లాదేశ్ ఇప్పుడు ముప్పు తలపెడుతోంది.
సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండానే పాక్ పౌరులకు వీసా
కరాచీ నుంచి చిట్టగాంగ్‌కు నేరుగా రవాణా నౌకలకు అనుమతి
న్యూఢిల్లీ/ఢాకా, డిసెంబరు 8: పాకిస్థాన్ మారణహోమాలను అడ్డుకుని.. తన ఆవిర్భావానికి సహకరించిన భారత్ భద్రతకే బంగ్లాదేశ్ ఇప్పుడు ముప్పు తలపెడుతోంది. పాక్‌కు నానాటికీ చేరువవుతూ దానిని సంతృప్తిపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే పాక్ పౌరులు భద్రతాపరమైన నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవాలన్న నిబంధనను తీసివేసింది. పాక్‌లోని కరాచీ నుంచి బంగ్లాలోని చిట్టగాంగ్ వరకు సరుకు రవాణా నౌకలను నేరుగా అనుమతించాలని కూడా బంగ్లాదేశ్ నిశ్చయించింది. దీనివల్ల పాక్ ఉగ్రవాద సంస్థల నేతలు యథేచ్ఛగా బంగ్లాలోకి అడుగుపెట్టి.. తనను నష్టపరిచే కార్యకలాపాలు చేపడతారని భారత్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. కాగా, ఇస్కాన్ భక్తులకు ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి బెదిరింపులు పెరుగుతున్నాయని ఇస్కాన్ ప్రతినిధి రాధారామ్ దాస్ అన్నారు.