Share News

Taslima Nasreen: నన్ను ఇక్కడే ఉండనీయండి.. అమిత్‌షాను కోరిన తస్లీమా నస్రీన్

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:10 PM

తస్లీమా నస్రీన్ తన పోస్ట్‌లో అమిత్‌షాకు నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశం వంటి గొప్పదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, గత 20 ఏళ్లుగా ఇండియా తనకు రెండో పుట్టినిల్లుగా ఉందని చెప్పారు.

Taslima Nasreen: నన్ను ఇక్కడే ఉండనీయండి.. అమిత్‌షాను కోరిన తస్లీమా నస్రీన్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima Nasreen) తనను భారతదేశంలోనే ఉండనీయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)కు విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని తన రెండవ పుట్టినిల్లుగా అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో 'ఎక్స్' ఒక పోస్ట్ పెట్టారు. అమిత్‌షాకు ట్యాగ్ చేశారు.

Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం..ఆ సీటు ఖాళీ


తస్లీమా నస్రీన్ తన పోస్ట్‌లో అమిత్‌షాకు నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశం వంటి గొప్పదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, గత 20 ఏళ్లుగా ఇండియా తనకు రెండో పుట్టినిల్లుగా ఉందని చెప్పారు. అయితే జూలై 2022 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తనకు రెసిడెన్స్ పర్మిట్‌ను పొడిగించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తనను ఇక్కడే ఉండనీయాల్సిందిగా ఆభ్యర్థించారు. అందుకు తాను రుణపడి ఉంటానని ఆపోస్ట్‌లో పేర్కొన్నారు.


తస్లీమా నస్రీన్ 1994 నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. కమ్యూనిలిజం, మహిళల సమానత్వంపై ఆమె రాసిన రచనలు బంగ్లాదేశ్‌లోని ఇస్లాం మతఛాందసులకు కన్నెర్ర అయింది. 'లజ్జ' (1993) పేరుతో తస్లీమా రచించిన నవల, 'అమర్ మెయెబెల' (1998) పేరుతో రాసిన ఆటోబయోగ్రఫీ వివాదానికి దారితీయడంతో బంగ్లాదేశ్‌లో వాటిపై నిషేధం విధించారు. ఇస్లాం మత ఛాందసుల నుంచి బెదిరింపులు రావడంతో 1994 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్నారు. దీనికి ముందు స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ అమెరికాలో పదేళ్లు అజ్ఞాతంలో గడిపారు. ఇండియాకు వచ్చినప్పుడు కోల్‌కతాలో 2007 వరకూ ఉన్నారు. ఆ తర్వాత మూడు నెలల కోసం ఢిల్లీ వచ్చాయి. ఆమెపై భౌతికదాడి జరగడంలో గృహనిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత 2008లో ఇండియాను విడిచిపెట్టి అమెరికా వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 21 , 2024 | 08:10 PM