Share News

Bengal Flogging Case: చోప్రాలో మరో కీలక నిందితుడు అరెస్ట్

ABN , Publish Date - Jul 03 , 2024 | 07:32 PM

ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.

Bengal Flogging Case: చోప్రాలో మరో కీలక నిందితుడు అరెస్ట్
Chopra in West Bengal

కోల్‌కతా, జులై 03: ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌ అధికారుల బృందం అరెస్ట్ చేసింది. అమిరుల్ ఇస్లాం స్వస్థలం చోప్రాలోని గిర్నర్ గ్రామం. అయితే చోప్రా ఘటనలో జంటపై స్థానిక టీఎంసీ నాయకుడు తాజ్‌ముల్ అలియాస్ జేసీబీ వెదురు కర్రతో దాడి చేశాడు. అదే సమయంలో అతడి పక్కనే అమిరుల్ ఇస్లామున్నాడని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: Viral Video: కుర్రకారు జోరు... నెటిజన్ల పోరు.. స్పందించిన ఖాకీలు

Also Read: Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం


అదీకాక ఈ కేసులో అమిరుల్ మరో కీలక నిందితుడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సదరు జంటపై వెదురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తాజ్‌ముల్‌ను ఆదివారమే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో.. తన అనుమతి లేకుండా తీశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని తన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Hathras Event: లైంగిక వేధింపుల కేసుల్లో ‘బోలే బాబా’..!


ఇంకోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై పలు రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలనేవి లేకుండా పోయాయని మండిపడ్డాయ. అలాగే కుచ్ బిహార్ నుంచి చాప్రా వరకు మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సందేశ్ కాలీ, నేడు చోప్రా.. రేపు ఎక్కడ అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.

Also Read: Lok Sabha Elections: ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్..

Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 07:51 PM