Share News

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:34 AM

ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియోమ్‌ స్పేస్‌ ఇంక్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్ర లక్ష్యంతో యాక్సియోమ్‌-4 మిషన్‌ను చేపట్టిన ఈ సంస్థతో తమ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఒప్పందం చేసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది.

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

  • యాక్సియోమ్‌-4 మిషన్‌కు గగన్‌ యాత్రికులు

  • ప్రధాన పైలట్‌గా గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా

బెంగళూరు, ఆగస్టు 2: ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియోమ్‌ స్పేస్‌ ఇంక్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్ర లక్ష్యంతో యాక్సియోమ్‌-4 మిషన్‌ను చేపట్టిన ఈ సంస్థతో తమ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఒప్పందం చేసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా మిషన్‌కు అవసరమైన ఇద్దరు గగన్‌యాత్రికులను ప్రధాన, బ్యాకప్‌ పైలట్లుగా సిఫారసు చేసినట్టు తెలిపింది. గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా ఈ మిషన్‌కు ప్రధాన పైలట్‌గా, గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ బ్యాకప్‌ పైలట్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. ‘ఈ మిషన్‌ కోసం కేటాయించిన క్రూ సిబ్బందిని ఐఎ్‌సఎ్‌సకు పంపేందుకు మల్టీలేటరల్‌ క్రూ ఆపరేషన్స్‌ ప్యానెల్‌ (ఎంసీవోపీ) అనుమతిస్తుంది. ఈ నెల మొదటి వారంలో ఈ ఇద్దరు గగన్‌ యాత్రికులు మిషన్‌ కోసం అవసరమైన శిక్షణను ప్రారంభిస్తారు’ అని ఇస్రో వెల్లడించింది. ఈ మిషన్‌లో భాగంగా గగన్‌యాత్రికులు ఐఎ్‌సఎ్‌సలో పరిశోధనలు చేపట్టడంతోపాటు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొంటారని తెలిపింది. మిషన్‌కు ప్రధాన పైలట్‌గా ఎంపికైన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లాకు 2 వేల గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది.

Updated Date - Aug 03 , 2024 | 04:37 AM