Share News

National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

ABN , Publish Date - May 16 , 2024 | 02:13 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఎ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది.

National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ
Bibhav Kumar

న్యూఢిల్లీ, మే 16: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఎ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది. మే 17వ తేదీ అంటే.. శుక్రవారం ఉదయం 11.00 గంటలకు మహిళా ప్యానెల్‌ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సూమోటోగా స్వీకరించినట్లు.. బిభవ్‌కు రాసిన లేఖలో జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మరి మహిళా ప్యానెల్ ఎదుట బిభవ్ కుమార్ హాజరవుతారా? లేదా? అనే అంశంపై స్పష్టత మాత్రం రాలేదు.


మరోవైపు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో కేజ్రీవాల్‌తోపాటు బిభవ్ కుమార్‌ సైతం లఖ్‌నవ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఎన్నికల ప్రచారం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టు‌ను ఆశ్రయించారు.

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?

దీంతో కేజ్రీవాల్‌కు ఇటీవల కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కొద్ది గంటలకే.. సీఎం కేజీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం విధితమే.

TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..

అయితే స్వాతి మలివాల్ పోలీస్ స్టేసన్‌కు వచ్చారని.. కానీ ఆమె ఎవరిపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై దాడి జరిగిందని ఆరోపించిన రోజు ఉదయం.. స్వాతి మలివాల్ నుంచి పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు గుర్తు చేశారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 16 , 2024 | 03:48 PM