Swati Maliwal assault case: బిభవ్ కుమార్‌కు సుప్రీం బెయిల్
ABN , Publish Date - Sep 02 , 2024 | 05:38 PM
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal Assault)పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)కు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు. ఈ ఏడాది మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో స్వాతి మలివాల్‌పై దాడి చేశారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. మే 18న కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని వివిధ కేసుల కింద్ కుమార్‌పై మే 16న ఎఫ్ఐఆర్ నమోదైంది.
కాగా, బిభవ్ కుమార్‌కు న్యాయమూర్తులు సూర్య కాంత్, ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు వ్యక్తిగత సహాయకుడిగా తిరిగి నియమించడం కానీ, సీఎంఏం కార్యాలయంలో ప్రత్యేక బాధ్యతలు కానీ ఆయనకు అప్పగించరాదని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. సాక్ష్యుల విచారణ పూర్తయ్యేంత వరకూ ముఖ్యమంత్రి నివాసంలో కుమార్ అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది.
Deli Waqf Board case: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ
కుమార్ గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దాడి కేసులో కుమార్ అరెస్టు తప్పనిసరని, ఆ పని చేసేటప్పుడు చట్ట నిబంధనలను పోలీసులు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. నిందితుడికి తగినంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని, బెయిలుపై విడుదల చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు గత ఆగస్టు 1వ తేదీన విచారణ సందర్భంగా సీఎం నివాసంలో ఇలాంటి ఘటన జరగడం సహేతుకమని అనుకుంటున్నారా? అని బిభవ్ కుమార్‌ను నిలదీసింది. ఒక యంగ్ లేడీతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించింది.
Read More National News and Latest Telugu New