Bihar: స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయిన ఐదుగురు చిన్నారులు మృతి
ABN , Publish Date - Oct 06 , 2024 | 06:55 PM
ఆదివారం ఉదయం ఏడుగురు పిల్లలు స్నానం కోసం నీటిలో దిగారని, వారంతా లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా మునిగిపోయారని చెబుతున్నారు. విషయం తెలిసిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలను వెలికితీశారు.
పాట్నా: బీహార్ (Bihar)లోని రోహ్‌టాస్ జిల్లా తుంబ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోనె నదిలో స్నానం చేస్తుండగా ఏడుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తక్కిన ఇద్దరు చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఈ పిల్లలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.
Businessman Missing: వ్యాపారి జాడగల్లంతు.. బ్రిడ్జిపై డ్యామేజీ అయిన కారు
ఆదివారం ఉదయం ఏడుగురు పిల్లలు స్నానం కోసం నీటిలో దిగారని, వారంతా లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా మునిగిపోయారని చెబుతున్నారు. విషయం తెలిసిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తు్న్నారు. కాగా, తామంతా స్నానానికి దిగినప్పుడు ఒక పిల్లవాడు మునిగిపోతుంటే అతన్ని కాపాండేందుకు తాము నీటిలోకి దిగామని, అయితే తాము కూడా నీటిలోకి జారిపోవడంతో ఏదోవిధంగా తప్పించుకుని బయటకు వచ్చామని గోలు కుమార్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఐదుగురు పిల్లలను ప్రాణాలతో కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రమాద సమాచారం తెలియగా పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ఐదు మృతదేహాలను వెలికి తీసినట్టు రోహ్‌టాస్ స్టేషన్ హెడ్ తెలిపారు. తక్కిన ఇద్దరికోసం గత ఈతగాళ్లు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయని అన్నారు. మృతులంతా 8 నుంచి 12 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ససారామ్ సదర్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనతో తంబ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.