Share News

Cheating: ఘోరం అంటే ఇదే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక భర్తను వదిలేసిన భార్య..

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:18 PM

జ్యోతి మౌర్య కేసు గుర్తుందా.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ కేసు. ప్యూన్ అయిన భర్త.. తన భార్యను ఉన్నత చదువులు చదిపించాడు. ఆమె ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు ప్రోత్సహించాడు. చివరికి అతని కష్టం, ఆమె ప్రయత్నం ఫలించి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ, అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది.

Cheating: ఘోరం అంటే ఇదే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక భర్తను వదిలేసిన భార్య..

పాట్నా, అక్టోబర్ 25: జ్యోతి మౌర్య కేసు గుర్తుందా.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ కేసు. ప్యూన్ అయిన భర్త.. తన భార్యను ఉన్నత చదువులు చదిపించాడు. ఆమె ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు ప్రోత్సహించాడు. చివరికి అతని కష్టం, ఆమె ప్రయత్నం ఫలించి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ, అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతో కష్టపడి చదివించిన తన భర్తను వదిలేసి మరో వ్యక్తితో వెళ్లిపోయింది ఆమె. ఆ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి కేసు ఒకటి సంచలనం సృష్టిస్తోంది. భార్య పోలీస్ ఉద్యోగం సాధించేందుకు అన్ని విధాలుగా సహకరించిన భర్తకు బిగ్ షాక్ తగిలింది. పోలీస్ ఉద్యోగం వచ్చా.. మహిళ తన భర్తను వదిలిపెట్టేసింది. ఈ ఘటన బీహార్‌లోని గయాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


గయా జిల్లాలోని షేర్‌ఘటి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మిథిలేష్ కుమార్.. తన భార్య చదువుకునేందుకు చాలా ప్రోత్సహించాడు. బీహార్‌లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగా.. ఆమె ఆ జాబ్ సాధించేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహించాడు. అయితే, తీరా జాబ్ వచ్చాక ఆమె అతన్ని విడిచిపెట్టింది. ఇదే విషయాన్ని చెబుతూ మిథిలేష్ జిల్లా ఎస్పీ అశిష్ భారతీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఈ కేసుపై విచారణకు ఆదేశించారు.


మిథిలేష్ కుమార్ భార్య ప్రీతి బీహార్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 2021లో ఉద్యోగం సాధించింది. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. వీరిద్దరికీ ఆరేళ్ల పాప కూడా ఉంది. కానీ, ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది. మెళ్లగా తన భర్తకు దూరమవుతూ వచ్చింది. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. కనీసం ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదని భర్త మిథిలేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య తనకు కావాలని.. మీరే న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నాడు మిథిలేష్.


మిథిలేష్ భార్య వాదన మరోలా..

మిథిలేష్ వాదన ఇలా ఉంటే.. అతని భార్య ప్రీతి వాదన మరోలా ఉంది. మిథిలేష్ తనను టార్చర్ పెడుతున్నాడని, కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. అతని చేష్టలు, అలవాట్లతో విసిగిపోయానంది. అందుకే అతని నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పింది. తన ఏటీఎం కార్డు లాక్కొని అందులోంచి డబ్బులు మొత్తం డ్రా చేసేవాడని వాపోయింది ప్రీతి. అతనితో కలిసి బతకాలనుకోవడం లేదని.. తాను తన బిడ్డతో ఒంటరిగా ఉండాలనుకుంటున్నట్లు ఉన్నతాధికారులకు వివరించింది ప్రీతి. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో.


Also Read:

ఉషమ్మా.. ఇదేందమ్మా.. ఇంకా ఆ భ్రమలోనే ఉంటే ఎలా..

ట్రాఫిక్ పోలీస్‌నే కారుతో ఈడ్చుకెళ్లిపోయాడు..

కోహ్లీ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే

For More National News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 12:18 PM